Posts filed under 'Uncategorized'

జాతీయ సదస్సు లో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు!

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎమిరిటస్ ప్రొపెసర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు జాతీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఆ దృశ్యాలలో కొన్నింటిని ఇక్కడ ఇలా…

జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
స్వాగతం పలికి అతిథులను పరిచయం చేస్తున్న ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు
సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు

కీలకోపన్యాసం చేస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు మాట్లాడుతుంటే ఆలకిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగాన్ని వింటున్న డా. కొలకలూరి మధుజ్యోతి తదితరులు

ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన కీలకోపన్యాసం గురించి ఆచార్య ఇనాక్ గారితో చర్చిస్తున్న అధ్యాపక బృందం
ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి అమ్మాయిలు డా ఆశాజ్యోతి, డా.మధుజ్యోతి గార్లతో డా. దార్ల , మంజుశ్రీ
ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి అమ్మాయిలతో డా ఆశాజ్యోతి, డా.మధుజ్యోతి గార్లు
ప్రారంభోపన్యాసం చేస్తున్న ఆచార్య మోహన్ జి. రమణన్ గారు
వందన సమర్పణ చేస్తున్న డా.పిల్లలమర్రి రాములు గారు

Add comment September 27, 2009

జాతీయ సదస్సులోని కొన్ని ఫోటోలు : ఎండ్లూరి సుధాకర్ గారివి!

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఈ సదస్సులో పాల్గొని రుబాయిత్, గజల్ ప్రక్రియల గురించి పత్రాన్ని సమర్పించారు. ఒక సదస్సుకి అధ్యక్షత వహించారు. వాటిలో కొన్ని ఫోటోలు.

తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. వేదిక పై ( ఎడమ వైపు నుండి) జె. రమేశ్ , డా. బాల శ్రీనివాసమూర్తి, డా. పిల్లలమర్రి రాములు, గుడిపాటి, భట్టు సుధాకర్
సదస్సులో పాల్గొన్న తర్వాత టీ విరామసమయంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
సదస్సులో పాల్గొన్న ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డా. రాములు, ఆచార్య తుమ్మలరామకృష్ణ తదితరులు
టీ సేవిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు సమావేశంలో పాల్గొన్న ప్రే క్షకులు

విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి గారితో మాట్లాడుతున్న డా. జె.భీమయ్యగారు
వేదికపైకి వెళ్ళేముందు తనకెంతో ఇష్టమైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ఆచార్య ఎండ్లూరి గారు ఆనందంగామాట్లాడుతూ…
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న డా. కనకయ్య, డా. దార్ల
సభలో ప్రసంగించే ముందు
ఆచార్య ఎండ్లూరి అధ్యక్షతన డా. అద్దేపల్లి రామమోహన రావు గారు పత్ర సమర్పణ చేశారు
సాహిత్య అకాడమీ సలహాసభ్యులు ఆచార్య జి. ఉమామహేశ్వరరావు గారు తదితరులు
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ఆచార్య ఎండ్లూరి సుధాకర్, వారి కుమార్తె మానస
సభలో జనం
సభలో జనం
ఆచార్య జి. ఉమామహేశ్వరరావు , ఆచార్యఎండ్లూరి సుధాకర్ తదితరులు

జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు

జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు

Add comment September 27, 2009

”వీచిక” ఆవిష్కరణ ఫోటోలు!

’వీచిక’ ఆవిష్కరణ ఫోటోలు!


వీచిక ఆవిష్కరణకు విచ్చేసిన సాహితీ వేత్తలకు స్వాగతం పలుకుతున్న రచయిత డా. దార్ల వెంకటేశ్వరరావు

సభలో అతిథులకు స్వాగతం పలుకుతున్న డా. అద్దంకి శ్రీనివాస్

వీచిక ఆవిష్కరణ కు ముందు జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న దృశ్యం
వీచిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు. సభలో పాల్గొన్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య మోహన్ జి.రమణన్ , డా.ద్వానాశాస్త్రి, రచయిత డా.దార్లవెంకటేశ్వరరావు తదితరులు

వీచిక ఆవిష్కరణ అనంతరం ఆచార్య పరిమి రామనరసింహం దంపతులకు పుస్తకాన్ని అంకితం చేస్తున్న దృశ్యం
డా. ద్వానాశాస్త్రి గారు తన శిష్యుడు డా.దార్ల వెంకటేశ్వరరావుని సన్మానిస్తున్న దృశ్యం
వీచిక ఆవిష్కరణకు విచ్చేసిన ఆచార్య ఉమామహేశ్వరరావు, డా.బి. రాజశేఖర్, ఆచార్య ముజఫర్ ఆలీ తదితరులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన తెలుగు శాఖ అధ్యాపకులు డా. రేమెళ్ళ రామ కృష్ణ శాస్త్రి, డా. పిల్లలమర్రి రాములు, ఆచార్య తుమ్మల రామకృష్ణ, డా. అద్దంకి శ్రీనివాస్ తదితరులు
వీచిక పుస్తకాన్ని సమీక్షిస్తున్న ఆచార్య జి. అరుణకుమారి గారు
వీచిక పుస్తకాన్ని సమీక్షిస్తున్న ఆచార్య జి. అరుణకుమారి గారు
సభలో పాల్గొన్న ప్రేక్షకులు
అంకితం స్వీకరించిన తర్వాత రచయిత దంపతులను అభినందన సత్కారం చేస్తున్న ఆచార్య పరిమి రామనరసింహం దంపతులు

వీచిక అంకితం స్వీకరించిన తర్వాత తన స్పందనను వ్యక్తీకరిస్తున్న ఆచార్య పరిమి రామనరసింహం గారు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు

వీచిక ఆవిష్కరణ సభలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ సభలో పాల్గొన్న హైదరాబాదువిశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య మోహన్ జీ రమణన్ కి తొలి ప్రతి అందిస్తున్న రచయిత డా.దార్ల వెంకటేశ్వరరావు
వీచిక ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఫిలాసఫీ డిపార్ట్ మెంట్ హెడ్ ఆచార్య రఘురామరాజు తదితరులు

వీచిక ఆవిష్కరణ సభలో పాల్గొన్న హైదరాబాదువిశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య మోహన్ జీ రమణన్ కి తొలి ప్రతి అందిస్తున్న రచయిత డా.దార్ల వెంకటేశ్వరరావు
వీచిక ఆవిష్కరణ సభకు విచ్చేసిన ప్రేక్షకులు
వీచిక ఆవిష్కరణ అనంతరం ఆచార్య పరిమి రామనరసింహం దంపతులకు పుస్తకాన్ని అంకితం చేస్తున్న దృశ్యం


వీచిక ఆవిష్కరణ అనంతరం ఆచార్య పరిమి రామనరసింహం దంపతులకు పుస్తకాన్ని అంకితం చేస్తున్న దృశ్యం

Add comment August 22, 2009

నాన్న సమాధి ఫోటోలు

నాన్న సమాధి ఫోటోలు

#fullpost{display:none;}

నాన్నగారి గురించి ఇలాంటి టపా రాయవలసి వస్తుందని ఊహించలేకపోయాను. ప్రతి జీవికీ తల్లి, తండ్రీ ఎంతో ముఖ్యం. వాళ్ళున్నంత వరకూ ఏదో గొప్ప ధైర్యం ఉంటుంది. వాళ్ళలో ఎవరు దూరమైపోయినా ఆ బాధ వర్ణనాతీతం. నాకైతే నాన్న ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనిపిస్తుంది. మళ్ళీ ఊరికెళ్ళినప్పుడు ఎదురొస్తాడనిపిస్తుంది. మా చెల్లి పిల్లల్లో ఒకడు ఇలా అడిగాడు” మావయ్యా… సమాధి నుండి జీసెస్ మళ్ళీ బయటకొచ్చారటకదా… తాతయ్య కూడా వచ్చేస్తారు కదా” వాడికేమని చెప్పాలి? మనిషి మరణం తప్పదని తెలిసి కూడా ఎందుకిలా ఇన్ని రకాలైన అనుబంధాల్ని పెంచుకుంటుంటాం? ఏది ఏమైనా నాన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి పోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజంగా మళ్ళీ నాన్నని చూడగలుగుతానా? నిజంగా స్వర్గ,నరకాలున్నాయా? పోనీ బైబిల్ ప్రకారమే చూసినా నిజంగా సమాధి నుండి మళ్ళీ మానవులు లేవబడతారా?

నాన్న గారికి కుటుంబ సభ్యులు, ప్రజల్లు నివాళి సమర్పించారు.

మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో ఏప్రిల్ 9 వతేదీన మానాన్న గారి జ్ఞాపకార్ధ కూటమి జరిగింది. ఈ సందర్భంగా నలుగురు ఫాస్టర్స్ జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్నారు. బైబిల్ వాక్యాన్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు.

జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
బైబిల్ వాక్యాన్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు.

భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.11
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.


ప్రజలు, కుటుంబసభ్యులు ఈస్టరు రోజున నివాళులు అర్పించి ప్రార్థనలు చేశారు.
సమాధి దగ్గర ఈస్టరు రోజునఫాస్టరు గారు బైబిల్ వాక్యాన్ని చదివి వినిపించారు.
ఈస్టరు రోజున పువ్వులతో, కొవ్వొత్తులతో అగరుబత్తీలతో నిండిపోయిన నాన్న సమాధి.

Add comment April 16, 2009

మైనారిటీ సాహిత్యం-మరో చూపు

(ఈరోజు (16-3-2009) ఆంధ్రప్రభ సాహిత్యానుబంధంలో మైనారిటీ సాహిత్యం-మరో చూపు పేరుతో ఈ కింది వ్యాసం ప్రచురితమైంది. )

డా// దార్ల వెంకటేశ్వర రావు తెలుగు లెక్చరర్,

కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు,

గచ్చిబౌలి, హైదరాబాదు – 500046

vrdarla@gmail.com ఫోన్‌: 9989628046

ప్రపంచ వ్యాప్తంగా గానీ, భారత దేశంలో గానీ ముస్లిములు సంఖ్యాపరంగా మైనారిటీలు కాదు. భారతీయ జనాభా లెక్కల ప్రకారం చూసినా ముస్లిములు రెండవ స్థానంలో ఉన్నారు. అటువంటప్పుడు వీరిని మైనారిటీలని ఎలా పిలావాలి? అలా పిలవడం వెనుక ఉన్న కారణాలేంటి? అని ఆలోచించవలసి ఉంది. నా అభిప్రాయం ప్రకారం మైనారిటీ సాహిత్యం అంటే ముస్లిం సాహిత్యమే కాదు. క్రైస్తవ సాహిత్యం కూడా అవుతుంది. అయితే అది ఆ మతాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రజలపై జరుగుతున్న దాడులను, అభద్రతను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ మతం వల్ల వారిపై జరుగుతున్న అల్పసంఖ్యాక భావమే వారి రచనల్లో వ్యక్తమైతే అప్పడు అది “మైనారిటీ సాహిత్యం” అవుతుంది. “దళితులు” అని చాలామందిని కలిపి పిలుస్తున్నా, వాస్తవంలో దళితులంటే మాల, మాదిగ తదితర ఉపకులాలవారనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఉమ్మడిగా దళితుల్లో తమకి రావలసిన హక్కులను తమకి రావాలని వాదిస్తూ మాదిగ తదితర ఉపకులాల వాళ్ళు ఉద్యమంతో పాటు, సాహిత్యాన్ని కూడా రాస్తున్నారు. కానీ, ముస్లిం మైనారిటీ సాహిత్యానికి లభిస్తున్న ప్రాధాన్యత, దళితుల్లో అంతర్గతంగా జరుగుతున్న వ్యధలను వక్తీకరిస్తూ రాస్తుంటే, దానికి లభించడం లేదు. ఆ విధంగా మాదిగ సాహిత్యం ”మైనారిటీ తనాన్ని” సంతరించుకుంది. సామాజికంగానూ దళితులుగానూ వృత్తి చేతా, సహజీవనం చేయవలసిన వారి చేతా అవమానించబడుతూ, దాని గురించి రాస్తే ఏమవుతుందో అనే అంతటి అభద్రతతో అనేక మంది మాదిగ సాహితీ వేత్తలు ఆలోచిస్తున్నారు. వీరికి తగిన ప్రాధాన్యత లభించక పోగా, ఒకరిద్దరు ఎవరైనా సాహసించి తమ భావాల్ని రాస్తే, వారిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మాదిగ వాదాన్ని రాస్తునందుకు డా// ఎండ్లూరి సుధాకర్ పై అనేక మంది దాడి చేస్తున్నారు. కలం పేర్లతో, దొంగ పేర్లతో రాస్తూ సాహిత్య దాడులు చేస్తున్నారు. వ్యక్తి గతంగా కూడా నిందలు చేస్తున్నారు. డా// ఎండ్లూరి సుధాకర్ గారి వాదాన్ని సమర్ధిస్తూ రాసే వారి రచనలు ఎన్ని ప్రచురణకు నోచుకుంటున్నాయి? ఇదంతా మాదిగసాహిత్యం ”మైనారిటీ”కి గురికావడం కాదా? ఉమ్మడిగా దళితులుగా ఉండటం లేదా అలా పరిగణన పొందడం వల్ల మాదిగలకు జరుగుతున్న అన్యాయం కాదా? ఒరిస్సా,తమిళనాడు తదితర చోట్ల క్రైస్తవులపై, లేదా క్రైస్తవులుగా మతాన్ని స్వీకరిస్తున్న దళితులపై కొంతమంది దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్ని ఖండిస్తూ వెలువరించే ఎన్ని ప్రకటనలు న్యూస్ అవుతున్నాయి? అసలు ఆ దాడులు వెలుగులోకి రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఇదంతా క్రైస్తవులుగా మారేటప్పుడు దళితులు మైనారిటీ తత్త్వానికి గురికావడం కాదా? ఆ విషయాలన్నీ రాస్తే , వాటిని ప్రచురించే సంస్థలెన్ని ఉన్నాయి? తమ సమస్యల్ని , తమ ఫీలింగ్స్‌ని రాయడానికే భయపడుతున్న స్థితిలో ఉండటం మైనారిటీ భావం కాదా? తెలుగులో ముస్లిములు తమ అభద్రతను రాస్తుంటే వెంటనే ప్రచురించడామే కాకుండా, వాటి పై అనేక విశ్వవిద్యాలయాలు పరిశోధనలు కూడా చేయిస్తున్నాయి. ఈ స్థితి మాదిగ సాహిత్యానికి దక్కుతుందా? దళితుల్లోని మిగతా ఉప కులాల వారికి లభిస్తుందా? కనుక, మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే అని అనుకోవడం సరైంది కాదు. కానీ, సంఖ్యాపరంగా వాళ్ళు హిందువుల తర్వాత స్థానంలో ఉన్నా, అనేక కారణాల వల్ల ముస్లింలను మైనారిటీలని, వారు రాసే సాహిత్యం మైనారిటీ సాహిత్యం అనీ పిలుస్తున్నారు. కానీ, తెలుగులో వస్తున్న ముస్లిం సాహిత్య పుస్తకాలపై ఎక్కడా తమ సాహిత్యం ”మైనారిటీ సాహిత్యం” అని కనిపించట్లేదు. ఫోటోలో వరసగా డా//సీతారాం, ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, మాట్లాడుతున్న డా//దార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత ఉన్న ది స్కైబాబా. ‘మైనారిటీ’ అనే పదం ప్రధానంగా సంఖ్యావాచకాన్ని సూచిస్తుంది. దాన్ని మనం అల్ప సంఖ్యాక వర్గంగా భావిస్తున్నాం. 2005 సర్వే ప్రకారం ఎన్సిక్లోపిడియా బ్రిటానికా ప్రకారం ప్రపంచ జనాభాలో 33% క్రైస్తవులు, 20% ముస్లింలు, 13% హిందువులు, 5.9% బౌద్దులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 80.5% (82,75,78,868)హిందువులు, 13.4% (13,81,88,240) ముస్లింలు, 2.3% (2,40,80,016) క్రైస్తవులు, 1.9% (1,92,15,730) సిక్కులు, 0.8% (79,55,207) బౌద్దులు, 0.4% (42,25,053) జైనులు ఉన్నారు. అలాగే 0.6% (66,39,626) పర్షియన్లు మరియు ఇతర మతస్థులు ఉన్నారు. మత గుర్తింపు లేకుండగా 0.1% (7,27,588) ఉన్నారు. ఒక్క మన భారతదేశంలో ఉన్న సుమారు 102 కోట్ల జనాభాని ఆధారంగా తీసుకొని మాట్లాడినా, ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. సంఖ్యాపరంగా చూసినపుడు హిందువుల కంటే ముస్లింలు అల్ప సంఖ్యాక వర్గం అవుతారు. కాని, ముస్లింల కంటే అల్ప సంఖ్యాక వర్గంగా క్రైస్తవులు, బౌద్దవులు, తదితర మత వర్గానికి చెందిన వారు అవుతారు. కనుక, మరి ముస్లింలను మాత్రమే మైనారిటీ వర్గం అని ఎందుకు పిలవాలి? అనేది ఒక ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా చూసినా, క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలు ప్రకారం మాత్రమే. ఇంకా అనేక మంది ఉండవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఒకటి ఉంది. భారతదేశంలో ముస్లింలను మైనారిటీ వర్గం అని పిలవడం సమంజసమేనా? అలా పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? 1) ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళే కీలక వ్యక్తులుగా ఫోకస్ కావడం జరుగుతుంది. 2) ముస్లిం మతంలో అల్లా బోధనల్లో ఉన్నవి ఏమైనా గానీ, ‘జీహాద్‌’ పట్ల ముస్లిమేతర సమాజానికి వాస్తవ విషయాలు తెలుస్తున్నాయో లేదో తెలియదు. కానీ, జీహాద్‌ అనగానే ‘ఒక మత యుద్ధం’ అనే ప్రచారంలో ఉంది. తమ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే యుద్ధం అని కూడా ప్రచారంలో ఉంది. ఇలాంటి కారణాల వల్ల ముస్లింల పట్ల ప్రపంచ వ్యాప్తంగా, ఒక ద్వేష పూరిత వాతావరణం ఏర్పడిందనిపిస్తుంది. ప్రపంచంలోఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా, ఆ ఉగ్రవాదుల్లో ముస్లిం పేర్లు కనిపించినా, దాని ప్రభావం వల్ల కూడా అందరి ముస్లింలపై ఆ అనుమానపు చూపులు చూస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తుంది. భారతదేశంలో ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, వారి కంటే తర్వాత స్థానంలో ఉన్న వారికున్నంత స్వేచ్ఛ ముస్లింలకు లేదనే అభిప్రాయం బలంగానే వినిపిస్తుంది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు అత్యధికంగా జరుగుతున్న ప్రాంతాలు జమ్మూ & కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తదితరాలను చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో జనాభాని పరిశీలించినా ప్రథమ స్థానంలో హిందువులే ఉన్నారు. ముస్లింలకు రెండవ స్థానమే. జమ్మూ & కాశ్మీర్‌లో మాత్రం ప్రథమ స్థానంలో ముస్లింలు 67,93,240 రెండవస్థానంలో హిందువులు 30,05,349 ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో హిందువులు 13,39,79,263 మంది, ముస్లింలు 3,07,40,150 మంది ఉన్నారు. మహారాష్ట్రలో హిందువులు 77859385 మంది ముస్లింలు 1,02,70,485 మంది ఉన్నారు. ఢిల్లిలో హిందువులు 1,13,58,049 మంది ముస్లింలు 16,23,520 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందువులు 6,78,36,688 మంది ముస్లింలు 69,86,856 మంది ఉన్నారు. ఈ లెక్కలను చూసినపుడు జమ్మూ & కాశ్మీర్‌లో తప్ప మిగతా అన్నీ చోట్లా ఇంచుమించు హిందువులే అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. జమ్మూ & కాశ్మీర్‌లో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఈ నేపథ్యంతో చూసినపుడు ముస్లింలు నిజంగా అల్ప సంఖ్యక వర్గానికి చెందినవారే అవుతారా? అనేది ఒక బలమైన ప్రశ్న. నిజమే భారతదేశంలో హిందువులు తర్వాత ముస్లింలే అధిక సంఖ్యాకులు. కాని, 1992 డిశంబరు 6వ తేదిన బాబ్రి మసీద్ కూల్చివేత తర్వాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ తామంతా అల్ప సంఖ్యాక వర్గమనే భావం మరింత బలపడింది. ఆ తరవాత 2002లో గుజరాత్‌లో జరిగిన మత కల్లోలాలు ముస్లింలలో మరింత అభద్రతా భావాన్ని పెంచాయి. మరొక వైపు భారత స్వాతంత్రానికి ముందు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన నిజామ్‌ నవాబుల పాలన, ఆ కాలంలో నవాబుల చర్యల పట్ల ప్రచారంలో ఉన్న అభిప్రాయాలు నేటి ముస్లింల పట్ల ద్వేష పూరిత భావాన్ని కలిగిస్తున్నాయనీ ముస్లిం రచయితల రచనల బట్టి తెలుస్తుంది. ఈ అభిప్రాయాలన్నింటినీ, ఈ చారిత్రక నేపథ్యాన్ని చూసినపుడు ముస్లింలు దేశ వ్యాప్తంగా ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అభద్రతకు గురవుతున్నారనేది వాస్తవం. దీని కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 1.ఈ దేశంలో పుట్టి పెరిగినప్పటికీ ముస్లింలను చాలా మంది పరదేశీయులుగా భావించటం. 2. ముస్లింల పాలనలో హిందువులపై జరిగిన దాడులకు ముస్లింలను అందరినీ భాధ్యులుగా భావించటం. అవే అనుమానాలతో, అవే వాదనలతో అక్కడక్కడ మాట్లాడటం.3. సినిమాలలో ముస్లింలను దేశ ద్రోహులుగా చిత్రించటం.4) అన్ని వర్గాలతో జీవించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ముస్లిములను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారనే భావన. 5) మరొక వైపు ముస్లింలలో కూడా వర్గ, కుల భేదాలు ఏర్పడటం వల్ల ముస్లింలలోనే అంతర్గతంగా వివక్షతకు గురికావటం జరుగుతుందనే అనుభవ సత్యాలతో సాహిత్యాన్నీ సృష్టించటం. 6) అనేక సంవత్సరాలుగా భారతదేశంలోనే పుట్టి, పెరిగి అన్ని మతస్థులతో కలిసి మెలిసి జీవించటం వలన ముస్లిం సంస్కృతిలో వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా పీర్ల పండుగా, మోహరం, దర్గ పండుగలు అన్నీ ముస్లిం, హిందూ సమైఖ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నా, ఆచార సంప్రదాయాల వలన కొంతమంది ముస్లింలను ముస్లింలే తక్కువగా చూస్తున్నారనే భావన వ్యక్తమవుతుంది. 7) అరబ్బీ, ఉర్ధూ, పారశిక మొదలైన భాషలను అన్ని ముస్లిం వర్గాలు మాట్లాడ లేకపోవడం వల్ల భాషాపరమైన మైనారిటీని కూడా కొంత మంది ముస్లింలు అనుభవిస్తున్నారు.8) వివిధ పాలన కారణాల వల్ల జరిగిన మత మార్పిడిలలో దళిత వర్గాలు ముస్లింలుగా మారటంతో ముస్లింలలో కూడా స్థాయి భేదాలు పెరిగిపోయాయి. దీని వల్ల కూడా ముస్లింలలోనే మరో అల్ప సంఖ్యాక వర్గం ఏర్పడింది. ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నా ముస్లింల మనోభావాలను సాహితీకరించటంలో ప్రధానంగా మూడు ధోరణులు కనిపిస్తున్నాయి. అ) ముస్లిమేతరులు ముస్లింల గురించి రాయడం. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ముస్లింల గురించి ముస్లిమేతరులు తమ దృక్కోణంతో తమకు తెలిసిన జీవితాన్ని మాత్రమే రాయడం. మరో కోణంలో ముస్లింల పట్ల విష పూరిత భావాల్ని పెంచటం. ఆ) ముస్లింలే తమ మనోభావాలని వ్యక్తీకరించటం. ఇ) మత, కుల, వర్గ పరంగా జరుగుతున్న అన్ని వివక్షలను ప్రశ్నిస్తూ కొంత మంది ముస్లింలే రాయడం. ఆధునిక సాహిత్యంలో వచ్చిన వివిధ ధోరణి/ వాదన/ ఉద్యమాలలో స్త్రీ, దళిత, ముస్లిం మైనారిటి సాహిత్యం అనే విభజన ఇంచుమించు సాహితీవేత్తలందరూ అంగీకరించారు. జల్‌జలా, ఆజా, గుజరాత్ గాయం, అలావా, జగన్ కీరాత్, నఖాబ్‌, ముల్కీ, వతన్‌ తదితర ముస్లిం సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి. అంతక ముందు ‘చిక్కనవుతున్న పాట’, ‘పదునెక్కిన పాట’, ‘బహువచనం’ తదితర కవితా సంకలనాలలో కూడా ముస్లిం వేదనను తెలిపే రచనలు ఉన్నాయి. నిజానికి ముస్లిం సాహిత్యం, ఆ వాదనలను కేవలం హైదరాబాదు కేంద్రంగానే కాకుండా,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి భావాల్ని సమీకరించే దిశగా జరగాలనే వారూ ఉన్నారు. వీరి రచనలపై అనేక విశ్వ విద్యాలయాలు పరిశోధనలు చేస్తున్నాయి. ముస్లిమేతర సాహిత్య విమర్శకులు కూడా ఈ సాహిత్యాన్ని గుర్తించారు. ఇప్పుడు చెప్పుకున్న ముస్లిం రచయితల రచనలలో కూడా తమ వాదాన్ని బలమైన స్వరంతోనే చెప్పుకున్నారు. ముస్లిం సాహిత్యంలో కూడా ముస్లిం స్త్రీవాద సాహిత్యం అనే విభాగాన్ని కూడా సాహితీ వేత్తలు గుర్తిస్తున్నారు. అయితే, ఆయా పుస్తకాలలో గానీ, ఆ పుస్తకాలపైన గానీ ఎక్కడా కూడా తమది ”మైనారిటీ సాహిత్యమ”ని పేర్కొనలేదు. కానీ, అత్యధిక సంఖ్యాక వర్గం దగ్గర నివశించే అల్పసంఖ్యాక వర్గం పొందే అభద్రతా భావమే వారి రచనల నిండా ప్రతిఫలిస్తుంది. కనుక ”మైనారిటి” అనేది ఆ ప్రజల మానసిక భావన. దానిని అనుసరించి ”మైనారిటీ సాహిత్యం” అని అనగానే ముస్లింల అభద్రతను తెలిపే సాహిత్యంగా గుర్తిస్తున్నారు. వారు రాసిన కవితలు, కథలు, వ్యాసాలు ఆ భావననే ప్రచారం చేస్తున్నాయి. ముస్లిం సాహిత్యంలో కూడా కొన్ని ఆంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ వారందరిలో కనిపించే మౌలిక భావన మాత్రం అభద్రతను ప్రతిఫలింజేయడం, తమని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం జరుతుతుందని, దానికోసం ప్రతిచోటా దేశభక్తిని నిరూపించుకోవలసి వస్తుందనీ వాదిస్తున్నారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, తదితర ముస్లిం దేశాలలో జరిగే మత, సామాజిక కార్యక్రమాలతో భారతీయ ముస్లింలు కూడా ఒకే గాటినికి కట్టేసి చూడటం జరుతుందనీ, కానీ తాము ముందు భారతీయులమని గుర్తించాలని వాదిస్తున్నారు. ఇలా అనేక కారణాల వల్ల వీరి సాహిత్యమే ” మైనారిటీ సాహిత్యం” గా మన తెలుగులో చాలా మంది పరిగణిస్తున్నారు. భారత దేశంలో మతపరంగా జరిగినట్లే కుల, ప్రాంత, లింగ వివక్ష కూడా కొనసాగుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వారిలోనే అనేక ఉపకులాలు, అలాగే బి.సి. లలోని అనేక ఉపకులాలు ఉన్నాయి. వీరికి ఎవరి అస్తిత్వం వారికి ఉంది. వీళ్ళందరికీ రాజ్యంగం ప్రకారం లభించవలసిన హక్కులు సమానంగా లభించటం లేదు. కొన్ని ఉప కులాల వారికి అన్యాయం జరుగుతుంది. ప్రాంతాల వారిగా చూసినప్పుడు కూడా ఈ వివక్ష కనబడుతుంది. కనుక నిర్ధిష్ట ఉపకుల సాహిత్యంలో అల్ప సంఖ్యాక వర్గ తత్వమే కనిపిస్తుంది. మన భారతదేశంలో దళితులంతా అనేక పేర్లతో ఉన్నారు. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వారి కుల నామాలు భిన్నంగా ఉన్నాయి. దానిని బట్టి వారి వృత్తి, సాంఘిక హోదా, దానిని అనుసరించి వారి ఆర్ధిక పరిస్థితి నిర్ణయించబడుతుంది. భారతదేశంలో సుమారు అర్థ శతాబ్ధం క్రితం జరిగిన సర్వేలను అనుసరించి ఏర్పడిన కుల జాబితాలేనేటికీ కొనసాగుతున్నాయి. వాటిని అనుసరించి రూపొందినవే చట్టాలుగా అమలులోకి వచ్చాయి. వాటి వల్ల సమైఖ్యత పేరుతో ఉన్న షెడ్యూలు వల్ల కొన్ని కులాలు, ఉపకులాలు దోపిడీకి గురవుతున్నాయి. వాటిని గుర్తించిన మేథావులు సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నా, అభివృద్ధి నిరోధక శక్తులు వాటిని తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ ఉద్యమం అలాంటిదే. కనుక మైనారిటీ అనేది కులాలు, ఉపకులాలను బట్టి కూడా ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్నా, వారు భారతదేశంలో అల్ప సంఖ్యాకులే. వాళ్ళు కేవలం రెండు శాతం కూడా లేరు. 19వ శతాబ్డం వరకూ ముస్లిం, హిందూ పాలన ప్రభావం వల్ల క్రైస్తవుల ప్రభావమే లేదు. హిందూ ఆధిపత్యమే కొనసాగింది. తర్వాతకాలంలో బౌద్ద, జైన మత ప్రభావాలు ఉన్నా, ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత, ప్రభావం చాలా వేగవంతంగానే కనిపించింది. మూడో మతంగా క్రైస్తవ మతం తన స్థానాన్ని ఏర్పరుచుకుంది. బ్రిటీష్ పాలనా ప్రభావంతో క్రైస్తవ మతం వేగంగానే విస్తరించింది. అలా విస్తరించడానికి పాలనా ప్రభావం ఉన్నా, క్రైస్తవంలో కనిపించే ప్రేమ తత్త్వం కింది వర్ణాల్ని విశేషంగా ఆకర్షించింది. దీనికి తోడు ఆర్థికంగా కూడా సహకారి అయ్యింది. హిందూ మతంలో చూపే కుల వివక్ష మొదట్లో క్రైస్తవంలో కనిపించక పోవడంతో సామాజికంగా కింది వర్ణాల వాళ్ళు క్రైస్తవంలోకి మారిపోవడంతో హిందూ మతంలో సంస్కరణోద్యమాలు వేగవంతమయ్యాయి. ఆ సంస్కరణ ప్రధానంగా హిందూ మతాన్ని పునర్జీవింప చేసే దిశగానే జరిగాయి. కానీ, దాన్ని సాంస్కృతిక పునర్జీవనమన్నారు. మరోవైపు బ్రిటిష్ పాలన అన్ని రంగాలలోనూ ఆధిపత్యాన్ని చెలాయించడాని తద్వారా భారతీయ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో వస్తున్న మార్పుల పట్ల మేథావులలో ఆలోచన ప్రారంభమైంది. అదే ధోరణి కొనసాగితే దేశ సార్వభౌమత్వం ప్రశార్ధమై పోతుందని ఊహించారు. వ్యాపారం కోసం వచ్చినా, తర్వాత కాలంలో అన్ని రంగాల్ని శాసించే స్థాయికి చేరుకోవడంతో సాంస్కృతిక పునర్జీవన కార్యక్రమాలు మరింత వేగవంతమయ్యాయి. మరోవైపు భారతీయుల స్వయం పాలన కోసం జరుగుతున్న స్వాతంత్ర్యోధ్యమంతో వేగవంతమైంది. దీనిలో భాగంగానే సంస్కరణోద్యమం రావడం, దానిలో భాగంగా ‘హరిజనుల’ పట్ల గాంధీజీ ప్రణాళిక బయటకొచ్చింది. హరిజననోద్యమం దళితుల్ని ఆలోచింపజేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేసింది. హరిజనోద్యమం దళితులకు విముక్తి కలిగించిందని, బ్రిటిష్ పాలకుల దగ్గరే దళితులకు కొన్ని ప్రత్యేక హక్కుల్ని పొందే ప్రయత్నం మరోవైపు అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగింది. స్వాతంత్ర్యానంతరం దళితులకు ఏవో కొన్ని రిజర్వేషన్లు తప్ప, కుల నిర్మూలన జరగక పోగా, దళితులపై మరింత ద్వేష భావం పెరిగిపోయింది. మరోవైపు దళితుల్లోనూ కొన్ని వర్గాల వాళ్ళే రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కుల్ని పొందడంతో, మరికొన్ని దళిత వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దాని కోసం దళితుల సమైక్యత అనేది అన్ని రకాలుగా పంపిణీ జరిగినప్పడే జరుగుతుందని భావించే స్థితికి చేరుకుంది. దాన్ని కొన్ని దళిత వర్గాలు అంగీకరించక పోవడంతో వర్గీకరణ ఉద్యమాలు రాక తప్పలేదు. అలా పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్గీకరణ ఉద్యమం తీవ్రమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లి కూడా వర్గీకరణలో గల సామంజస్యాన్ని అంగీకరించింది. దీనితో దళితుల్లోని ప్రధాన వర్గాలైన ‘మాల – మాదిగ’ లలో మాదిగలు ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడుతున్నారు. కానీ, మాదిగ సాహిత్యాన్ని ఒక ప్రత్యేక సాహిత్య ధోరణిగా దళిత సాహితీ వేత్తలు కూడా అంగీకరించడం లేదు. తమ ఆవేదనల్ని వ్యక్తం చేస్తున్నా మాదిగ సాహిత్యం ఇప్పుడు మైనారిటీ సాహిత్యమైంది. అలాగే, దేశంలో జరుగుతున్న క్రైస్తవులపై, క్రైస్తవుల జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ రాస్తున్న సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యమే అవుతుంది. అలాగే తెలంగాణపై జరుగుతున్న వివక్షను తెలిపే సాహిత్యం కూడా మైనారిటీ సాహిత్యమే అవుతుంది. ( 10-12-2008 న రాజమండ్రిలో కేంద్ర సాహిత్య అకాడమీ, నన్నయ విశ్వవిద్యాలయం, మనోఙ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించిన ” మైనారిటీ సాహిత్యం చర్చలు ” సదస్సులో చేసిన నేను చేసిన అధ్యక్ష ఉపన్యాసాన్ని కొన్ని మార్పులు చేర్పులతో ఇక్కడ అందిస్తున్నాను. )

Add comment March 18, 2009

కైతునకల దండెం కవితాసంకలనం గురించి పత్రికలు

సూర్య దిన పత్రిక (అక్షరం) లో16-2-2009 న వచ్చిన వ్యాసం
ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (హైదరాబాదు టాబ్లాయిడ్) 14-2-2009 న ప్రచురించిన వార్తావిశే॑షాలు

Friday, February 13, 2009

ఇక పై మాదిగసాహిత్యంలో అంతర్భాగమే దళిత సాహిత్యం: కైతునకల దండెం కవితాసంకలనం ఆవిష్కరణ సభ విశేషాలు

Dr.Darla Venkateswara Rao
Assistant Professor,Dept. of Telugu
School of Humanities,
UNIVERSITY OF HYDERABAD
Gachibowli, Hyderabad. A.P.,India

vrdarla@gmail.com

13-2-2009 సాయంత్రం ఆరు గంటలు కాకుండానేహైదరాబాదు ప్రెస్ క్లబ్బులో కైతునకల దండెం (అనేక కులాల వాళ్ళు రాసిన మొట్టమొదటి మాదిగ కవిత్వ సంకలనం) ఆవిష్కరణ సభ ప్రారంభమైంది. నిజానికి అది ఒక సాహిత్య సదస్సులా జరిగింది. రాష్ట్ర నలు మూలల నుండీ కవులూ, రచయితలు, కళాకారులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కు పోవడం వల్ల ఆరున్నరకు గానీ నేను వెళ్ళలేక పోయాను. అప్పటికే దండోరా ప్రచురణల సమన్వకర్త, కవితా సంకలనం సంపాదకుడు కృపాకర మాదిగ మాట్లాడుతున్నారు. నన్ను గమనించి వేదిక పైకి ఆహ్వానించారు. అప్పటికే వేదిక పై ఆచార్య ననుమాసస్వామి, డా//అద్దేపల్లి రామమోహన రావు, డా//కనకయ్య, వేముల ఎల్లయ్య, షాజహానా, కారంచేడు సంఘటనలో తన భర్తను పోగొట్టుకున్న బాధితురాలు, చెప్పులు కుట్టుకొనే మాదిగ వృత్తి కార్మికుడు ఈతకోటి తుక్కేశ్వరరావు లు వేదిక పై కూర్చున్నారు.

సభాధ్యక్షుడుగా వేముల ఎల్లయ్య గారు, సమీక్షకులుగా డా//కనకయ్య, నేను (డా//దార్ల వెంకటేశ్వరరావు) పాల్గొనగా, మిగతావాళ్ళు సందేశాన్నిచ్చే అతిధులు గాను, కారంచేడు సంఘటనలో తన భర్తను పోగొట్టుకున్న బాధితురాలు శ్రీమతి సిర్రాసులోచన., ఈతకోటి తుక్కేశ్వరరావులు గ్రంథావిష్కర్తలుగా పాల్గొన్నారు.

ఈతకోట తుక్కేశ్వరరావు అమలాపురం లో అనేక సంవత్సరాలుగా చెప్పులు కుట్టుకుంటూనే మాదిగ హక్కుల దండోరా కోసం కృషి చేస్తున్న వారు. వీరిద్దరి చేతా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

వారి అనుభవాలను మాదిగ కవులు బ్లాగులోపెట్టిన వీడియో ద్వారా వినవచ్చు.

పుస్తకాన్ని సమీక్షిస్తూ డా// కనకయ్య మంచి కవితలను ఎంపిక చేశారనీ, అయితే అనేక కవితల్లో మాదిగల ఆహార విషయాలే ముఖ్యంగా మాంసం, ఎండు తునకలు వంటి పదాలను పదేపదే చెప్పుకోవలసిన అవసరం లేదనీ, మరికొన్ని కొత్త ఆలోచనలతో కవిత్వం రాయాలని సూచించారు.

నేను తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకు రాబోతున్న కవిత్వసంకలనం కైతునకల దండెం అని అభివర్ణించాను. గతంలో మా మాదిగ సాహితీవేత్తలు ఆశించిన రీతిలో నేటికైనా మాదిగహక్కుల దండోరా వాళ్ళు సాహిత్యాన్ని కూడా ప్రచురించడం సంతోషించదగిన పరిణామమని చెప్పాను. కేవలం సామాజిక ఉద్యమాలే కాకుండా, సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు ఏజాతినైనా తాత్త్వికంగా నిలబెడతాయని, ఆ దిశగా ఈ పుస్తకం రావడం వల్ల మాదిగల సాంస్కృతిక అంశాలను వివరించి, మాదిగలను మరింత చైతన్యవంతంగా జీవించేటట్లు చేసే ఆలోచనకు ఇది అంకురార్పణ కాపోతుందని అన్నాను. దీనికి కైతునకల దండెం పేరుపెట్టడంలోనే మాదిగల సాంస్కృతిక చైతన్యాన్ని ముందుకు తీసుకురావాలనే ఆరాటం కూడా కనిపిస్తుందని వ్యాఖ్యానించాను.ఈ పుస్తకంలో కేవలం మాదిగల కవితలే కాకుండా , అనేక కులాల వారి కవితలు ఉండటం, సభలో కేవల మాదిగలే పాల్గొనేటట్లు, మాట్లాడేటట్లు కాకుండా అన్ని వర్గాల వారిని ఆహ్వానించడాన్ని మాదిగల సమైక్యతకు నిదర్శనంగానూ, తమ గురించి మాట్లేడే వారిని, రాసే వారిని, తమని ఆదరించేవారిని ఎప్పుడూ గౌరవించుకుంటామని చెప్పడానికి ఈ సభే నిదర్శనం అని వ్యాఖ్యనించాను. దీని వల్ల మాదిగలు అనైక్యతను కోరుకోవడం లేదనీ, సమైక్యతనే కోరుకుంటున్నారని, అయితే ఆ సమైక్యత ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలని కోరుకోవడాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాదిగలు చేసేది దళితులను విడదీసే చర్యగా వక్రీకరిస్తున్నారని వివరించాను. మా సమస్యలు ముందు పెట్టడానికి ప్రయత్నించడమే తప్ప మాకే పీఠాలు దక్కాలనేమీ లేదనీ, దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కృపాకర్ మాదిగ, జూపాక సుభద్రలేనని , వాళ్ళు ఈ కవితలను సేకరించడానికీ, పుస్తకంగా తీసుకొనిరావడానికి పడిని శ్రమను కూడా మరిచి పోయి, వాళ్ళు వేదిక పైన కాకుండా, సభలో అందరితోనూ కూర్చున్నారని చూపించాను.

ఈ పుస్తకంలో మాదిగల చరిత్ర,, సంస్కృతి, మాదిగలకు జరుగుతున్న అన్యాయం, ఆ అన్యాయం నుండి వస్తున్న అనుభూతులను, ఆవేదనలను, న్యాయం కోసం పడుతున్న తపనను చూడవలసిఉంటుందన్నాను. మాదిగలు చేసిన ఉద్యమ ఫలితంగా వచ్చిన వర్గీకరణ ఫలాలను సుప్రీంకోర్టు కొన్ని సాంకేతిక కారణాలను చూపి రాజ్యాంగ రీత్యా వర్గీకరణ చెల్లదనడంతో మాదిగల జీవితాల్లో ప్రవేశించిన శూన్యాన్ని, నిస్సహాయతనూ, దిక్కుతోచని తనాన్నీ కూడా ఈ పుస్తకంలో కవిత్వమై పలకరించడాన్ని చూడవచ్చని వివరించాను. తెలుగు సాహిత్యంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాదిగల జీవితాన్నే ఆధారంగా చేసుకొని దళితులను వర్ణించారనీ, అయినా దళితుల్లో అంతర్భాగంగా నే మాదిగలను చూస్తున్నారని, అలా చూడ్డంలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుందని వివరించాను. సాహిత్యంలో దళిత సంస్కృతి అంతా మాదిగ జీవన విధానం చుట్టూనే అలముకున్నా, మాదిగల వృత్తి చిహ్నాలను, సంస్కృతిని వాడుకుంటూనే మాదిగల వేదనను పైకి రానివ్వడం లేదని పేర్కొన్నాను. ఇప్పుడిప్పుడే విశ్వవిద్యాలయ స్థాయిల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే, ఇక పై మాదిగసాహిత్యంలో అంతర్భాగమే దళిత సాహిత్యంగా పరిగణించడం సమంజసమని, ఆదిశగానే మాదిగ సాహిత్యం పేరుతోనే ముందుకు వస్తామని, ఈ కొత్త ప్రతిపాదనను సాహితీ మేధావులు ఆహ్వానించాలని కోరాను. ఈ పుస్తకంలో మాదిగల చరిత్ర, సాంస్కృతిక పరమైన అంశాలను ఆయా కవులు చెప్పేటప్పుడు తమ అనుభవాలను చిలకరిస్తున్నప్పుడు విడివిడిగా అవి స్వతంత్ర అస్తిత్వాన్నీకలిగి ఉంటాయనీ, అయితే అవన్నీ ఇలా పుస్తకరూపంలోకొచ్చినప్పుడు పునరుక్తిలా కనిపిస్తాయని అది మాదిగ కవుల దోషం కాదనీ స్పష్టం చేశాను. అంతే కాకుండ వక్రీకరణకు గురికాబడుతున్న చరిత్రను, సంస్కృతిని కాపాడుకొనే దిశగా ప్రయత్నిస్తున్న మాదిగలు బలవంతంగా తమపై రుద్దిన సాంస్కృతిక అంశాలను, మళ్ళీ ఇప్పుడు మంచివి కాదనడాన్ని తరస్కరించడంలో కనిపించే దిక్కారస్వరాన్ని గుర్తించాలని కోరాను. గొడ్డు మాంసం తినడం వెనుక గల చారిత్రక అంశాలను పరిశోధించవలసి ఉందన్నాను,

ఈ కవితాసంకలనానికి సంపాదకులు రాసిన ముందుమాట మాదిగ సాహిత్యానికి మ్యానిఫెష్టో వంటిదని, మాదిగ సాహిత్యం స్వతంత్ర అస్తిత్వాన్ని కోరుకోవడం వెనుక గల చారిత్రక అంశాలను సోదాహరణంగా వివరించడం జరిగిందని కొన్నింటిని చదివి వివరించాను. మాదిగ సాహిత్యాన్ని ఎవరైనా రాయవచ్చనీ, అయితే మాదిగల హృదయాన్ని ఆవిష్కరించేలా, జీవితం ప్రతిఫలించేలా ఉండాలని ముందుమాటలో ప్రకటించిన విషయాన్ని గుర్తించాలని చెప్పిన అంశాన్ని వివరించాను. మాదిగ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి ఈ కవితా సంకలనం రచయితల్లో పునరుజ్జీవనం తీసుకొస్తుందని ప్రకటించాను.

సభలో పాల్గొన్న షాజహానా కవితల్లో కనిపించే స్త్రీవాద దృక్పథాన్ని విశ్లేషించారు. ప్రాంతీయ కోణంతో కూడా కవితలు ఉంటే బాగుండేదని, అలాగే ముస్లిం రచయితలు కూడా మాదిగల గురించి రాసిన కవితలను తీసుకుంటే మరింత సమగ్రంగా ఉండేదని సూచించారు. తన జీవితంలో ఎదురైన వివిధ సంఘటనలను వివరించారు.

డా//అద్దేపల్లి రామమోహన రావు మాదిగ సాహిత్యాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఆచార్య ననుమాస స్వామి కవితలను, గేయ బాణీలతో ఉన్న కవితలను విశ్లేషించారు. సభలో మధ్యమధ్యలో కవులను పిలిపించి మాట్లాడించడం, కళాకారులను పిలిచి పాటలు పాడించడం, వీటితో పాటు మాదిగేతర సాహితీవేత్తలను మాట్లాడించి మాదిగ హక్కుల ఉద్యమాన్నిబలపరిచే వ్యూహంతో సభను జరిపారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన చెప్పులు కుట్టుకొని జీవించే ఈతకోటి తుక్కేశ్వరరావు మాట్లాడుతూ ఇలా తనతో ఒక పుస్తకాన్ని, అదీ హైదరాబాదులో ఆవిష్కరించడాన్ని జన్మలో మరిచిపోలేనని మాదిగ వాడిగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైందని అశ్రునయనాలతో స్పందించారు. కారంచేడులో జరిగిన సంఘటన దళితులను, అందులోనూ మాదిగనే ఊచకోత కోసిన మారణకాండను, అప్పుడు జరిగిన సంఘటనల్లో ప్రాణం పోగొట్టుకున్న తన భర్తను తలచుకొని కన్నీటి పర్యంతమైయ్యారు శ్రీమతి సిర్రాసులోచన. ఈ రెండు స్పందనలూ అందరినీ కదలకుండా చేసేశాయి.

ఇలా ఒక చారిత్రక ఘట్టంగా కైతునకలదండెం కవితాసంకలనం ఆవిష్కరణ సభ జరిగింది. మరలా దిగంబర సాహిత్యం ఆవిష్కరణ సభలను గుర్తుతెచ్చేలా ఈ సభ జరిగిందని అక్కడికి వచ్చిన వారంతా అభిప్రాయపడ్డారు.

దీన్ని మన సాహిత్య చరిత్ర కారులు ఎంతవరకూ, ఎలాంటి ప్రాధాన్యతనిస్తూ గుర్తిస్తారో వేచి చూడాలి

Add comment February 24, 2009

ముస్లిం మైనారిటీ కవిత్వం లో స్త్రీవాద దృక్పథం

-డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్,తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి,గచ్చిబౌలి,
హైదరబాదు.

1.0 ప్రస్తావన:

తెలుగులో స్త్రీవాదం వచ్చిన తరువాత, దళిత , ముస్లిం మైనారిటీ వాదంలోనూ స్త్రీ లు తమ సమస్యలను కవిత్వీకరిస్తున్నారు. అంతకు ముందు పురుషులే స్త్రీ సమస్యలను కొంతవరకూ స్పర్శిస్తూ కవిత్వం రాశారు. అయితే స్త్రీలు రాసిన కవిత్వంలో మరింత బలంగా ముస్లిం స్త్రీ సమస్యలు అభివ్యక్తయ్యాయి.
ముస్లిం స్త్రీ సమస్యలను షాజహానా, మున్వీరునిసా, మహేజబీన్, షహనాజ్ ఫాతిమా మొదలైన వాళ్ళు స్త్రీవాద దృక్పథంతో కవిత్వీకరిస్తున్నారు. షాజహానా రాసిన “నఖాబ్”( 2005) కవితా సంకలనం ముస్లిం స్త్రీ వాదానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతకు ముందు వచ్చిన ‘’జల్ జలా’’(1998) కవితా సంకలనంలో కూడా స్త్రీ వాద సమస్యలను వర్ణిస్తూ పురుషులు కవిత్వం రాశారు. ఖాదర్ మొహియుద్దిన్ ‘’పుట్టుమచ్చ’’(1991)లో, గుజరాత్ సంఘటనల తరువాత ‘’గుజరాత్ గాయం’’, ‘’ఆజా’’, ముస్లింల సాహిత్య ప్రత్యేక సంకలనం’’ ముల్కి’’(2005), ‘’అలావా’’(2006) కవితా సంకలనం, స్కై బాబా రాసిన ‘’జగన్కీరాత్’’, ఖాజా ‘’ఫత్వా’’(1998) మొదలైన వాటిలో ముస్లిం స్త్రీ వాదం కనిపిస్తుంది.
ఇంటిలో స్త్రీ పురుషుల మధ్య కనిపించే వివక్ష ఇతర స్త్రీలకున్నట్లే ముస్లిం స్త్రీలలోనూ ఉంది. కానీ, ఉన్నత విద్యనభ్యసించనివ్వకపోవడం, నిర్ణయాధికారం లేకపోవడం మొదలైన వాటి విషయంలో ముస్లిం స్త్రీలు మరింత వివక్షకు గురవుతున్నారు. బయటకు కనిపించే బురఖా, ఆ బురఖా వెనుక ఎన్నో నిర్భందాలు, బహు భార్యత్వ సమస్య, బహు సంతానోత్పత్తి కోసం అనుభవించే లైంగిక వివక్ష, భర్త చనిపోతే స్త్రీ పునర్వివాహం పట్ల తలెత్తుతున్నఅనేక పరిణామాలు మొదలైన సమస్యలు ముస్లిం స్త్రీ వాదంలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా, పురుషాధిపత్యం, కుటుంబ హింస, ఆర్థిక, సాంస్కృతిక విద్యా కారణాల వల్ల చాలామంది విడాకుల కోసం “తలాఖ్” చెబుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ కారణాల వల్ల పరదే్శాలకు వలస పోయిన తరువాత స్త్రీలు పొందే కష్టాలు, బాలికలను ముసలి వాళ్ళకిచ్చి వివాహం చేసే పద్ధతి, దాని వెనుక స్త్రీ ఆంతరంగిక మనస్తత్వం వంటివన్నీ ముస్లిం స్త్రీ వాదంలో కవయిత్రులు వర్ణిస్తున్నారు. దీని తెలుసుకొనే ముందు ముస్లిం మైనారిటీ సాహిత్యం అంటే ఏమిటో సంక్షిప్తంగానైనా తెలుసుకొంటే బాగుంటుంది.
1.1 ముస్లిం మైనారిటీ వాదం:
తెలుగు సాహిత్యంలో “మైనారిటీ వాదం” అనే పేరు వినిపిస్తుంది. Minority అనగా “అల్ప సంఖ్యాకులు” అని అర్థం. భారతీయ జనాభా లెక్కలప్రకారం హిందువుల తర్వాత స్థానంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైన వారు సంఖ్యాపరమైన క్రమంలోకనిపిస్తున్నారు. హిందువులు తప్ప మిగిలిన వారంతా ఇంచుమించు అల్పసంఖ్యాకులే. అయినప్పటికీ అల్ప సంఖ్యాకులైన ముస్లింలు తమ కష్టనష్టాలను అభివ్యక్తి కరించే సాహిత్యాన్ని “మైనారిటీ వాదం” అంటున్నారు. తెలుగు సాహిత్యంలో ‘మైనారిటీ వాదం’ అనేది ఒక పారిభాషిక పదంగా మారింది. ప్రపంచ వ్యాప్త పరిస్థితులను బట్టి తమ సమస్యలలోప్రత్యేకత ఉందని అల్ప సంఖ్యాక వర్గం కావడం వల్ల అభద్రత భావం నెలకొందని భావిస్తున్న ముస్లింల మనోభావాలను ప్రతిఫలిస్తు వస్తున్న సాహిత్యమే మైనారిటీ వాద సాహిత్యం. దీన్ని “మైనారిటీ వాద సాహిత్యం”,” ముస్లిం సాహిత్య వాదం”, “మైనారిటీవాదం” వంటి మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఈ స్వరూప స్వభావాలను సాధారణీకరించి తెలుగు సాహిత్యంలో ముస్లింల ప్రత్యేక అనుభవాలవ్యక్తీకరణను గుర్తించ గలిగే విధంగా దీనిని “ముస్లిం మైనారిటీ వాదం” అని పిలవడం సమజసంగా ఉంటుంది.
1.2 ముస్లిం మైనారిటీ వాదం – నిర్వచనం:
1) ముస్లిం మనోభావాలను శక్తి వంతంగా “పుట్టు మచ్చ” కవిత ద్వారా వ్యక్తీకరించిన ఖాద్దర్ మొహియిద్దిన్‌ గారి ప్రకారం – “ముస్లిం వాదం అంటే ముఖ్యంగా ముస్లిం ఆలోచనల చట్టం అన్నారు. దీన్ని మరింత వివరిస్తూ “ముస్లిం తత్త్వం, ముస్లిం తాత్త్విక దృక్పథం,ముస్లింలు గతాన్ని ఎలా చూడాలి ?తమ భవిష్యత్ ను ఎలా నిర్మించుకోవాలి? ఈ రెండింటికి సబంధించిన వివిధ అంశాల పట్ల ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి? వీటిని వివరించేదే ముస్లిం తాత్త్విక దృక్పథం. ఈదృక్పథాన్ని సాహిత్య కళారంగాల్లో ఎలా ప్రతిఫలింపజేయాలో వివరించేదేముస్లిం సాహిత్య దృక్పథం” అని ముస్లిం సంస్కృతి కవిత్వం”అలావా ” కు రాసిన ముందుమాట (సూఫీతత్వమే సరైనా మార్గం..)లోఖాద్దర్ మొహియిద్దిన్ అన్నారు. ఈయనే ముస్లిం మైనారిటీ వాదాన్ని ఇంకొంచెం లోతుగా వివరిస్తూ “ముస్లిం వాదమంటే ఒక ధార్మిక సముదాయంగా తన గతిని స్థితిని తను దర్శించుకునే చైతన్యం. తనవైన ప్రతీకలు చిహ్నల ద్వారా తనదైన ఒక అభివ్యక్తి అంతేకాదు . ముస్లిం వాదం అంటే భారతీయ ముస్లిం సంస్కృతిక విలువల పట్ల , ఆ మాటకి వస్తే మొత్తం ప్రాశ్చ ప్రపంచ సాంస్కృతిక విలువల పట్ల, సార్వజనీయమైన మానవత విలువల పట్ల ఒక నిబద్ధత, ఒక జాగురూకత . వాటిని పరిరక్షించుకునే ఒక ప్రయత్నం. వాటి అభివృద్ధి ని కాంక్షించే ఒక సంకల్పం. తెలుగు ద్వారా భారతీయ సాహిత్యాన్నికి తద్వారా మానవ నాగరీకతకి అందుతున్న అపూర్వమైన ఒక అదనపు విలువ ముస్లింవాదం.ముస్లింవాదం తనలోనే తానొక ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ముస్లిం వాదం తనకోసం తనదైన పద్ధతిలొ తన ఉనికిని లోకాన్నికి చాటి చెప్పేందుకు సృష్టించిన సృజనాత్మక నినాదం” అని అన్నారు.
2)ముస్లిం మైనారిటీ వాదం గురించి కొన్ని వ్యాసాలు రాసిన ప్రముఖ విమర్శకురాలు ముదిగంటి సుజాతరెడ్డి గారి అభిప్రాయంలో “మైనారిటీ వాదం అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మొదలైన మతపరంగా అల్పసంఖ్యలో ఉన్నవారందరూ ఉండాలి. కాని వారు ఎవ్వరూ ఈ అభివ్యక్తిలో లేరు. క్రిస్టియన్ ల వేదన కొంత వరకు దళిత వాద కవిత్వంలో ప్రకటితమవుతుంది. ఇంక కేవలం ముస్లింల వేదన ప్రకటించేదే మైనారిటీ వాదంగా కనిపిస్తుంది. భారతదేశపు విశాలమైన దేశీయ సమాజంలో భాగంగా గుర్తింపబడక పోవడం అనే ఆవేదన అందరిచేత కాకున్న కొందరి లెక్కల్లో దేశ ద్రోహులుగా తప్పుడు ప్రచారం చేయబడుతున్న బాధ మైనారిటీ వాదంలోని ముస్లిం సాహిత్యంలో వ్యక్తమవుతున్నది. ఇది కేవలం కాషాయమూకలకు వ్యతిరేకంగాను, ఫ్యాసిస్ట్ ధోరణులకు వ్యతిరేకంగాను లేస్తున్న సాహిత్యోద్యమం కాదు. కాని మతోన్మాద శక్తులు చూపే వివిక్ష ,అంటగట్టే దేశ ద్రోహత్వం , జరిపే హింసకు కుమిలిపోతు బయటకు వ్యక్తం చేసే వేదన మైనారిటీ కవిత్వంలో కనిపిస్తుంది.” అని ఈ మైనారిటీ సాహిత్య స్వభావం గురించి వివరించారు. ( “ముల్కి- ముస్లిం సాహిత్య సంకలనం, 2005: 93)
3) ముస్లిం మైనారిటీ వాదాన్ని ఉద్యమప్రాయంగా ముందుకు తీసుకువెళితున్న స్కై బాబా అభిప్రాయంలో – “భారతదేశంలోని ముస్లింలు ప్రత్యేక పరిస్థితుల రీత్యా ముస్లిం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విషయాల్ని గురించి ముస్లిం వాదం మాట్లాడుతుంది. మతం వ్యక్తిగతం అనే స్పృహతో మతం జోలికి ముస్లింవాదం వెళ్లదు. కాని, ముస్లింల జీవన మార్గాని కి ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డంకులుగా నిలుస్తున్న అంశాల పట్ల స్పందిస్తుంది. ముస్లింలను అణిచి వేస్తున్న మూల శత్రువుతో పోరాడుతునే అంతర్గత వైరుధ్యాలను వదలకుండా బాహ్య అంతర రెండు పోరాటాలు చేయడం ముస్లింవాదం ప్రత్యేకత. హిదుత్వ దాష్టీకాన్ని ప్రశిస్తూనే అంతర్గతంగా ముస్లిం స్త్రీల గురించి, దూదేకుల గురించి ముస్లింలోని ఛాందసత్వం గురించి, ముస్లిం సమాజంలో జరగవలసిన సంస్కరణ ల గురించి, తమ మూలాల వెతుకులాట గురించి ఎంతో సాహిత్యాన్ని సృష్టించటం ఆ సాహిత్య ప్రత్యేకత “అని అన్నారు. ( “అలావా ” ముస్లిం సంస్కృతి కవిత్వం, 2006 :18)
మొత్తం మీద ముస్లిం మైనారిటీవాద సాహిత్యం ఒకవైపు స్వీయమతంలోని మూఢాచారాలను ఖండిస్తూ మరొక వైపు మాతృదేశంలోతమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ అగ్ర వర్గానికి కింది వర్గానికి మధ్య నలిగిపోతూ తాము ఏ స్థితిలో ఉన్నారో తెలియజేస్తూ రాసున్న సాహిత్యం “ముస్లిం మైనారిటీ వాద సాహిత్యం” అని నిర్వచించుకోవచ్చు.
1.3 ముస్లిం మైనారిటీ కవిత్వం – స్త్రీవాద దృక్పథం:
ఈ వ్యాసంలో ముందే ప్రస్తావించినట్లు వివక్షను ఆధారంగా చేసుకొని ముస్లిం స్త్రీవాదం వచ్చింది. మతాన్ని ఆధారంగా చేసుకొనే ఇంచుమించు అన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికి ఆయా సమస్యలను బట్టి కింది విధంగా ముస్లిం స్త్రీవాదాన్ని వివరించుకునే అవకాశం ఉంది.
1.3.1 మతాంతరీకరణ – భాషా సమస్య:
వివిధ పాలన, సాంఘిక, మతకారణాల వల్ల కొన్ని సామాజిక వర్ణాల వాళ్ళు ముస్లింలుగా మతాంతరీకరణ చెందడం వల్ల భాష, ఆచార వ్యవహారాల్లో కలిగే ఇబ్బందులను కూడా ముస్లిం స్త్రీలు కవిత్వీకరిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని కవితా ఖండికలను చూస్తే ముస్లిం స్త్రీ వాదం ఎలా ఉందో తెలుస్తుంది. ముస్లిం స్త్రీ పరంగా వారి మనోభావాలను వర్ణించడంలో చేయి తిరిగిన రచయిత్రి షాజాహానా. ఆమె “లద్దాఫ్ని ” పేరుతో రాసిన కవితలో ముస్లింలలో ‘లద్దాఫ్ ‘ స్త్రీ మానసిక జీవితాన్ని చిత్రించారు. వచ్చీ రాని ఉర్దూ పదాలతో మాట్లాడుతుంటే ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడం కోసం ఉర్దూ నేర్చుకోవాలనే వారి ప్రయత్నం, ఆ భాష రాక, తన మాతృ భాషలోనే మాట్లడితే వచ్చే నష్టమేమిటనే ప్రతిఘటన స్వరాన్ని కూడా వినిపించగలిగారు కవయిత్రి. ‘భాష ‘ భావాభివ్యక్తికి బలమైన వాహిక మాత్రమే తప్ప. ఫలానా భాషలోనే మాట్లాడాలనే నియమం లేదని ఒక శాస్త్రీయమైన ఆలోచనను ప్రతిఘటన స్వరంతో ప్రతిధ్వనిస్తూ…”వచ్చోరాదో – నా ఉర్దూ పరిజ్ఞానం మీదవాళ్ళ కుతూహల ప్రావీణ్య ప్రదర్శన జరిగినప్పుడు -”తెగించి – బయటకు రాలేని మొహమాటపు నీటి చుక్కలుకంటె కొనల్లో ఇరుక్కొని అచ్చం నాలాగే అల్లాడతాయ”ని వర్ణించారు. ముస్లిం స్త్రీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిని వర్ణిస్తూ -”వాళ్ళ ఉరుదూ జరీ చీరల సమూహాల గల గలల మెరుపుల ముందునా గొంతు కాటన్ చీరై బిక్కు బిక్కుమంటూఒంటరిగా ముడుచుకుంటుంది.” అని ఆ పరిస్థితిని జరీ చీరల మధ్య కాటన్ చీర తెల్లబోయిన దృశ్యాలతో పోల్చారు కవయిత్రి. జరీ చీరలను ముస్లింల లోని ఉన్నత వర్గానికి, కాటం చీరను కింది వర్గానికి ప్రతీక చేసి వర్ణించారు కవయిత్రి. దీని ద్వారా ముస్లింలలోని వర్గ సమస్యను కూడా చెప్పినట్లయింది. అవమానాల నుండి ఆత్మ గౌరవాన్ని ప్రదర్శిస్తూ -” నీ దూదేకుల తనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడుఅస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?” అంటుంది కవయిత్రి “లదాహీ రహూంగీ” అంటూ కవితను ముగించారు.
1.3.2 సంతానోత్పత్తి – లైంగిక హింస:
ముస్లిం స్త్రీ అనగానే చాలా మందిలో వినిపించే మాట అనేకమందికి జన్మనివ్వడానికి పుట్టిన స్త్రీ! ఈ సమస్యను శక్తి వంతంగా కవిత్వీకరించారు ‘షహనాజీ పాతిమా”!” ఓపిగ్గా అసంఖ్యాక వారసుల్నిచ్చేసంతానోత్పత్తి కర్మాగారం…అనాదిగా ఆధారపడ్డం అలవాటు చేయబడినస్వయం ప్రతిపత్తి లేని పరాధీన ” గా ముస్లిం స్త్రీ బతుకుని వెళ్ళదీస్తున్న దృశ్యాన్ని అభివర్ణించారు కవయిత్రి . ‘ఖబర్దార్’ అనే కవితలో ముస్లిం స్త్రీ అనుభవిస్తున్న లైంగిక హింసను షాజహానా ఇలా వర్ణించారు.” మీ సుఖంకోసంప్రాణం చీల్చుకు పన్నెండు మందిని కనమనండిలేకపోతే నరకంఇప్పుడు అనుభవిస్తున్నదే పక్కా స్వర్గం”ఇలా వర్ణించి వదిలేయలేదు కవితను. తిరుగుబాటు తత్వాన్ని పేరేపిస్తూ ఇలా అంటారు.” మమ్మల్ని మౌన మాంసాలుగాఉత్పత్తి యంత్రాలుగా బతకమన్న మీ సంప్రదాయానికో సలాం”ఇక్కడ షాజహానా కవితలో ముస్లిం స్త్రీ వేదనను వర్ణించటమే కాకుండా సమస్య పరిష్కారానికి మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. సంప్రదాయంలో ఉన్నంత కాలం స్త్రీకి విముక్తి లేదనేది ముస్లిం స్త్రీలు గుర్తించాలని కవయిత్రి భావిస్తున్నారు.
1.3.3 వివాహం -బహు భార్యత్వం:
ముస్లింలకు పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ లో ముస్లిం వివాహ వ్యవస్థ గురించిఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే బహూ భార్యాత్వాన్ని అంగీకరించ వచ్చునని స్పష్టంగానే ఉంది. దీన్ని వక్రీకరిస్తూ, మత పెద్దల అండ దండలతో స్త్రీ మనోభి ప్రాయాలను విలువనివ్వకుండా జరుగుతున్న వివాహం గురించి, ఆ వివాహాల వెనుక ఉండే దయనీయ గాథల గురించి కూడా కవిత్వం వచ్చింది.” నేనొక అరబ్బు కామ వాంఛకుబలైన బొమ్మను…..పరదేశానికి అమ్ముడైనఅంగడి బొమ్మను నేను….కన్న వాళ్ళ అసహాయితకుకటిక పేదరికానికిబలిపీఠం ఎక్కుతున్న వాళ్ళంమేము కేవలం బొమ్మలం ” ఒకవైపు పేదరికం, మరొక వైపు మూఢత్వం చేసే పెత్తనం. ఈ రెండింటి మధ్య బొమ్మల్లా మారిపోతున్న స్త్రీల గురించి మున్వీరున్నీసా రాసిన “గుడియా” కవిత గొప్ప నిదర్శనం!
1.4 ఉపసంహారం:
ముస్లిం స్త్రీవాదం గురించి మాట్లాడుతూ డా// ఎండ్లూరి సుధాకర్ ఇలా అన్నారు. “ముస్లిం స్త్రీవాద కవిత్వం అంటే ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంది. ఇక్కడ సానుభూతికి తావులేదు. ముస్లిం స్త్రీ పుట్టుక ముస్లిం స్త్రీ ఉనికిని నిర్ధారిస్తుంది.” (ముల్కీ 2005 – 95) ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే ముస్లిం స్త్రీవాదం గురించి ముస్లిం స్త్రీల రచనలనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇతరుల రచనలను తీసుకున్న ముస్లిం స్త్రీలు రాసినదానికున్నంత ప్రాధాన్యతను ఇవ్వవలసిన అవసరం లేదని గుర్తించాలి. అంతే తప్ప ఇతరులు రాయకూడదని కాదు. ఈ పత్రంలో ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వాన్నే ప్రధానంగా తీసుకొని విశ్లేషించడం జరిగింది. ముస్లిం స్త్రీలు రాసిన కవిత్వంలో వారి బాధలు వెల్లడవుతున్నాయి. ఇతర మతాలు, వర్ణాలలో కంటే ముస్లిం స్త్రీ ఇస్లాం మతంలో మరింత పీడనకు గురవుతుందని ముస్లిం స్త్రీవాదం వల్ల స్పష్టమవుతుంది. వస్తువులో వచ్చిన నవ్యత శిల్పంలో కూడా ప్రవేశించి తెలుగు సాహిత్యానికి మరింత సొగసుని అందించిందని చెప్పుకోవచ్చు. ముస్లిం సాహిత్యం రాస్తున్న కొద్దిమందిలో స్త్రీవాద దృక్పథంతో రాస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలోను శక్తివంతంగా రాసే కవయిత్రిగా నిలుస్తున్నారు. ఈ విధంగా విశ్లేషించుకున్నపుడు ముస్లిం స్త్రీవాదం షాజహానా చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. ముస్లిం సమస్యలు మరిన్ని బయటకు రావాలంటే ముస్లిం మహిళలు మరింత మంది చదువుకోవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇస్లాం మతంలోని కొన్ని లోపాలు స్త్రీ పాలిట శాపాలుగా వక్రీకరించని పరిస్థితి నెలకొంటుంది.
ఆధార గ్రంథాలు:
1. నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం) షాజహానా, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. ఫిబ్రవరి, 20052. ముల్కీ (ముస్లిం సాహిత్య సంకలనం) సంపాదకులు: వేముల ఎల్లయ్య, స్కైబాబ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్. జూలై, 2005.3. అలావా (ముస్లిం సంస్కృతి కవిత్వం) సంపాదకులు: షాజహానా, స్కైబాబ, నసాల్ కితాబ్ ఘర్ ప్రచురణ, హైదరాబాద్. జూలై, 2006.
Published an article on Muslim Minority Kavithvamlo streevaadadrukptham , Hyderabad Mirror Daily Literary Supplement on Dec.02nd2007,( Page No:06), and also published in UGC National seminar special issue, published by Dept.of.Telugu, Bandlamudi Hanumayamma Hindu Mahila Degree Kalasala, Guntur, A.P., Page No :74-76

1 comment February 24, 2009

కులం – వర్గం : శంబుక దృక్పథం

డా//దార్ల వెంకటేశ్వరరావు
లెక్చరర్,తెలుగు శాఖ,
సెంట్రల్ యూనివర్సిటి,గచ్చిబౌలి,
హైదరబాదు
సమాజాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, సమకాలీన సాహిత్యాన్నీ, అందులోనూ దళిత సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అవసరం ! దళితుల భాగస్వామ్యంలేని భారతీయ సమాజాభివృద్ధిని ఊహించడం అసాధ్యం. కులవివక్షను అనుభవిస్తూ, తప్పనిసరై చేస్తున్న వృత్తులు, కులవృత్తులుగా వంశపారంపర్యం కావడం , అవి దేశ సంపదకు ప్రధానమైనా, వాళ్ళెలా అప్రధానమయ్యారో శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యడం ప్రస్తుత అవసరం. నిషేధాలు , సానుభూతులు, సంఘర్షణలు, సహకారాలు దళిత జీవితాల్లో ఎలా పెనవేసుకుపోయాయో, అవన్నీ భారతీయ సమాజంతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలియకపోతే, సంక్లిష్టమైన సమాజాన్ని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. ఈ సంక్లిష్టత అర్థం కావాలంటే, దళిత జీవితం, దళిత సాహిత్యం అవగాహనకు రావాలి . చాలామంది రచనలు చేసేవాళ్ళు, సమాజ సంక్లిష్టతను అర్థం చేసుకోవడంలో , అవగాహన చేసుకోవడంలో, వాటిని ఆవిష్కరించడంలో, రచనలు చేసే వారి జీవన నేపథ్యాలను బట్టి కూడా సాహిత్య ప్రతిఫలనం జరుగుతుంటుంది. ఈ ప్రతిఫలనం దళిత సాహిత్యంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది . అయితే, కేవలం రచనలను బట్టే , రచన చేసిన వారి స్వభావాన్ని పూర్తిగా అంచనా వేయడానికీ కొన్ని సమస్యలున్నాయి.
ప్రత్యక్షంగా దళితులను వ్యతిరేకిస్తూ, అణచివేస్తూ, ఆ దళితులనే పునాదులుగా చేసుకొని ‘ అభివృద్ధి ‘ లోకి వస్తున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు . అలాగే చదువుకున్న మేథావులు కూడా, దళిత సాహిత్యాన్ని వ్యతిరేకిస్తూ , బయటకొచ్చి, వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలను దంచేస్తుంటారు . అవసరమైతే రాశామని చెప్పుకోవడానికి సానుభూతి దిగతుడుపుగా, దళిత సాహిత్యాన్ని రాస్తుంటారు . దానివల్ల వస్తే, గిస్తే, సన్మానాలు, బహుమతులు అందుకోవడానికీ వెనుకాడరు. దళితులుగా పుట్టిన వాళ్ళూ దళితులం కాదంటునే , దళితులకొచ్చే అన్ని అవకాశాల్నీ కొల్లగొట్టేయడంలో, ఇతర కులాలకే మాత్రం తీసిపోలేదని కొంతమంది నిరూపిస్తున్నారు . నిజానికి ఇతర కులాల వాళ్ళు, వీళ్ళకంటే కొంత నయమనిపిస్తుంటుంది . ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు , చైతన్యవంతులైతే ఏదొకరూపంలో తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారిలో ‘ శంబుక ‘ ఒకడు !
1.1. శంబుక దళిత చైతన్యం:
శంబుక పేరుపెట్టుకున్న ప్రత్తిపాటి మల్లేశ్వరరావు సమకాలీన సమాజంలో కనిపించే హిపోక్రసీని చూస్తూ, నోరు మూసుకుని , కాళ్ళూ చేతులుకట్టుకొని, ఏమూలనో దాక్కుంటూ, తన పబ్బం గడిపేసుకుందామనుకోలేదు . మాటై, పాటై, ఉద్యమ బాటై స్పందించారు . తన భావాలను కవిత్వంగా అందించారు. తన ఆలోచనలను పరిశోధనాత్మకంగా ” ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంపై కుల ప్రభావం – ఒక పరిశీలన ” లోనూ, ” చరిత్రలో క్రైస్తవం – ఒక పరిశీలన ” లోనూ స్పష్టంగానే చెప్పారు .
ఆశలు రేపినా కూడా ఆవేశంతో ముంచేసింది మార్క్సిస్టుల మార్గం, ఆవేశాన్ని అణచివేసి, కులం రంగు పూసుకుని , వివక్షను ప్రదర్శించే ‘మతం’ మార్గంలో మరొకటి దళితులను దగా చేసిందని నోరెత్తి, హోరెత్తి అక్షరమై ఆ గ్రంథాల్లో ధ్వనింప చేశారు శంబుక .
కుల నిర్మూలనకు, దాని అవగాహనకు, తద్వారా సమాజం చైతన్యవంతం కావడానికీ ఆధునిక ఆలోచనలనూ పంచాలనే ఆశయంతో నాస్తిక సమాజంలో చేరి , ప్రతీ విషయాన్ని దేవుడితో ముడిపెట్టే కర్మసిద్ధాంతాన్ని ఖండించారు. ఆధునిక భారతీయ సమాజంలో దళితపల్లె కూడా ఒకటవ్వాలని కలలుగన్నారు .
‘శంబుక ‘ చరిత్రను చెప్పడానికీ వ్యాసం రాయడం లేదు! శంబుక చైతన్యాన్ని మరొకసారి స్మరించుకోవడానికే ఈ ప్రయత్నం. దళిత సాహిత్యంలో తమకోసం జీవితాలను త్యాగాలను చేసిన వారిని స్మరించుకొంటూ, చైతన్యం పొందడమనే లక్షణం ఒకటి ఉంది. దీనిలో భాగమే ‘ శంబుక ‘ పై ఈ వ్యాసం. శంబుక రాసిన కవిత్వంలో కనిపించే దళిత దృక్పథాన్ని చెప్పాలనుకుంటున్నాను. 1958 డిసెంబర్ 9 న పుట్టి, గుంటూరు పరరిసరాలు చైతన్యవంతం చేయడంలో తనవంతు పాత్ర నిర్వహించిన శంబుకను మార్క్సిస్టు దళారీలు ఏప్రిల్ ఒకటో తేదీ, 1995 న దారుణంగా హత్య చేశారు.
‘శంబుక’ ఆశించిందేమిటి? ఆయన కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలో, దళిత సాహిత్యం ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని వివరించుకునే ముందు దళిత కవితాభివ్యక్తిలో ఉండే ప్రత్యేక అంశాలను చర్చించుకుంటే మంచిదేమో!
1.2. దళిత కవిత్వాభివ్యక్తి:
దళితులను చైత్యన్యపరచటం దళిత సాహిత్యం, ప్రయోజనాల్లో ప్రధానమైంది. కనుకనే, అభివ్యక్తిలో భాషలో తీసుకొనే అలంకారాలలో, శిల్పనైపుణ్యంలో అన్నీ దళితులకు అనుగుణమైన , తెలిసిన, అనుభవంలో ఉన్న వాటినే ఉపయోగించుకోవడం కనిపిస్తుంది. నిత్య జీవితంలో ముడిపడిన వాటినే ఊపమానాలుగా , ప్రతీకలుగా గ్రహించటం జరుగుతుంది. ‘ కళ కోసం కళ ‘ అనే శుద్ధ కళావాదుల వలే కాకుండా ‘ కళ ప్రజలకొరకే ‘ అనే నైతిక కళావాదుల వర్గంలోకి దళిత కవిత్వం చేరుతుంది . అయితే, దళిత కవిత్వ అభివ్యక్తి మూడు మార్గాల్లో పయనిస్తుందని చెప్పే అవకాశం ఉంది.
1) సాధారణమై పదాలు, నిత్య వ్యవహారంలో కలసిపోయిన సంభాషణ వలే కనిపిస్తూ, భాషకంటే వస్తుతత్వంపైనే దృష్టిని పెట్టేటట్లు చేయడం
2) భాష, వస్తుతత్త్వ వ్యక్తీకరణకి సమ ప్రాధాన్యతనిస్తూనే సౌందర్యాభివ్యక్తిలో మరే ఇతర సాహిత్యానికీ దళిత సాహిత్యం తీసిపోదని నిరూపించే ప్రయత్నం చేయడం.
3) ప్రతిదాన్నీ వ్యవస్థగా మార్చే ప్రయత్నం కూడా కనిపిస్తుంది.
దీనిలో మొదటి వర్గానికి శంబుక కవిత్వం చేరుతుందనిపిస్తుంది. ఇక్కడొక విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంది. దళిత కవిత్వ అభివ్యక్తీకరణ పద్ధతులను , స్థాయిలను పేర్కొనడమనేది, విశ్లేషణకు వీలుగా, అధ్యయన సౌలభ్యం కోసమే తప్ప, ఆధిక్యతలను, ఉచ్చనీచ భావాల్ని కలిగించడానికి మాత్రం కాదు ! ‘ శంబుక ‘ కవిత్వం దళితుల కోసం. దళిత సామాన్య ప్రజల కోసం రాసింది.
కవిత్వాన్ని తూచే పద్ధతుల్లో కొంతమంది దళిత కవులను ప్రత్యక్షంగా విమర్శించక పోయినా , పరోక్ష విమర్శలు చేస్తూ, అభివ్యక్తి నైపుణ్యం లేక, రాసిన దానినంతటికీ గొప్ప కవిత్వాభివ్యక్తిగా కీర్తించుకుంటూ, వస్తూరూపాల్లో, వస్తువుకే ప్రాధాన్యమని వాదిస్తున్నారనే వాళ్ళూ అక్కడక్కడా కనిపిస్తున్నారు . అలాంటి వాళ్ళకి సరైన సమాధానమిస్తూనే వస్తు రూపాల్లో సమప్రాధాన్యత నివ్వగలిగి, ఏ సాహిత్యానికైనా పోటీ పెట్టగల దళిత సాహిత్య సృష్టికర్తలు ఎంతోమంది ఉన్నారు . శివసాగర్, ఎండ్లూరి సుధాకర్, సతీష్ చంద్ర , మద్దూరి నగేష్‌ బాబు, శిఖామణి, పైడి తెరేష్‌బాబు, కలేకూరి ప్రసాద్‌, షాజహానా తదితరుల కవిత్వాన్ని పరిశీలిస్తే, దళిత సౌందర్యాభివ్యక్తి ఎంత సమర్థవంతంగా వ్యక్తమయ్యిందో తెలుస్తుంది. దళిత సౌందర్యం వస్తువు వల్లా, దాన్ని అభివ్యక్తీకరించడం వల్లా సమర్థవంతంగా కావడం ‘ శంబుక ‘ కవిత్వంలోనూ కనిపిస్తుంది. ” పోయేదేమీ లేనోళ్ళం ” అని తన కవితా సంపుటికి పేరు పెట్టుకోవడంలోనే, దళితుల పోరాట స్ఫూర్తినీ తెలియపరుస్తున్నారు కవి.
1.3. శంబుక దళిత దృక్పథం:
“శంబుక” రాసిన కవితల్లో కొన్నింటిని “పోయేదేమీ లేనోళ్ళం” పేరుతో ఒక పుస్తక రూపంలోకి తెచ్చాడు. వీటిలో శంబుక దళిత దృక్పథం, దళిత సాహిత్య అధ్యయనంలో ఒక ప్రధానవర్గ కోణాన్ని ఆవిష్కరించేదిగా ఉంది. శంబుక దళిత దృక్పథంలో కిందివి ప్రధానంగా కనిపిస్తాయి.
1) సమాజంలో కులం కనిపించడం ఒక విస్మరించలేని వాస్తవం.
2) “కులం” పేరుతో దోపిడీ జరుగుతుంది. ఇది భిన్న రూపాల్లో ఉంది .
3) కుల నిర్మూలనకు కృషి చేస్తున్నదెవరు? వ్యతిరేకిస్తున్నదెవరు? గమనించవలసి అవసరాన్ని నొక్కి చెప్పడం.
4) కులాన్ని వాడుకుంటూనే, కులాన్ని విస్మరించే వాళ్ళని వ్యతిరేకించడం.
5) కులపరంగా, ఆర్థికపరంగా మార్క్సిస్టులు పోరాటాల్ని నిర్మించవలసిన అవసరాన్ని చాటడం.
6) మార్క్సిస్టు పార్టీలో నాయకత్వం అగ్రవర్ణాలనబడే వారి చేతుల్లోనే మారు రూపాల్లో చేరడంవల్ల, మార్క్స్‌ లెనిన్‌మావో ఆశయాలు నెరవేరడంలేదనే అనుభవ సత్యాన్ని చాటడం .
7) దళితుల ఆత్మ గౌరవ ప్రకటనతో స్వీయ ఉద్యమాల నిర్మాణావశ్యకత వివరించటం
వీటితోపాటు మరికొన్ని అంశాలనూ తన కవిత్వంలో శంబుక శక్తివంతంగా చెప్పే ప్రయత్నం చేశాడు.
1.3.1. విస్మరించలేని స్థితిలో కులం:
“కులమయమిదం భారత్” కవితలో “శంబుక” సమాజ అంతరాల్లో కులం చొచ్చుకుపోయిన మార్గాలను అన్వేషించి చూపాడు. గుడిలో, బడిలో, మతంలో, ప్రేమలో, పెళ్ళిలో, ఉద్యోగంలో నిరుద్యోగిగా ఉండిపోవడంలో, ప్రభుత్వంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, ఓట్ల సీట్లలో, కాలేజీల్లో, కార్ఖానాల్లో, పండితునిలో, పామరునిలో, నీటిబోరుల్లో, విద్యుద్దీపాల్లో, జైళ్ళలో, నల్లకోట్ల న్యాయంలో, నాయకత్వంలో, రౌడీయిజంలో, పల్లెల్లో, పట్నాల్లో, పార్టీల్లో, చివరికి చావులో కూడా ‘ కులం ‘ ప్రస్తావన అనేది లేకుండా లేదు. కాకపోతే, ఆచారంగానో, సంప్రదాయంగానో కలసిపోయి , ఆంతర్యాన్ని వ్యక్తం చేస్తూ కులం తన స్వభావాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. దీనివల్ల కులానికీ ‘ ఒక్కో సంస్కృతి ‘ రూపొందడంలో ఆశ్చర్యపోవలసిన పనేమీలేదు . కానీ, భారతీయ సమాజాన్ని చూసినట్లయితే, నాటి నుండి నేటి వరకూ దళితులను రకరకాల పీడనలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ పీడనల నుండి రక్షించుకోవడానికి మతమార్పిడిలను తప్పనిసరి పరిస్థితులలో అంగీకరించవలసి వచ్చింది . ఏ కొందరో ఇష్టపడి కొన్ని మతాల్లోకి వెళ్ళినా, ఆ మతాల్లోనూ దళితులకి దక్కిన గౌరవం అనుభావంలోకొచ్చే సరికి , అందులొను ఇమడ లేని పరిస్థితులు! ఇలా హిందువులు , ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులుగా దళితులు మారిపోవటం వెనుక తరతరాల పీడన నుండి బయటపడాలనే ఆలోచనే ప్రధాన లక్ష్యం. దీని ఫలితంగా, సంస్కృతీ వైవిధ్యం దళితుల్లో ఎక్కువగా కనిపించినా, కులంలోని అంటరానితనం దళితులనందరినీ ఏకసూత్రంలో కట్టిపడేసింది .
భారతదేశ వ్యాప్తంగా పరిశీలించి చూసినట్లయితే కులానికో సంస్కృతి ఉన్నా, విభిన్న సంస్కృతులతో పాటు అస్పృశ్యత దళితుల్లోనే కనిపిస్తూ వంశపారంపర్యమయ్యింది. ‘కులం’ ఒక కాదనలేని సత్యమై కూర్చొంది! ” కులమయమిదంభారత్ ” కవితలో శంబుక! తన సైద్ధాంతిక భూమికనంతా ఈ కవితలో కవిపించేటట్లు చేసుకున్నారు . సిద్ధాంత వివరణ చేస్తున్నట్లుగా మిగిలిన కవితలను వర్ణించారు. అయితే ఈ సందర్భంలో సాహిత్య అభివ్యక్తి గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఉంది . ‘ కులమయమిదం భారత్ ‘ కవితలో సామాన్య పదాలతోనే ‘కవిత్వం’ చేశారు కవి . అలంకారాలు తొడగడం కంటే అలవోకగా చెప్పినట్లే కనిపిస్తుంది కవిత. “దళిత కవిత్వం ఇలాగే వుంటుందా”? అనే అనుమానం కూడా కలగవచ్చు. ఆధునిక సాహిత్యంలోనూ వ్యక్తి , వ్యక్తి చైతన్యం, వైయక్తికానుభూతులు మాత్రమే ఆధునిక చైతన్యం కాదనీ, మార్మికంగా వ్యక్తం చెస్తేనే సాహిత్యం గొప్పదనడం వంటి వాటిలో దళిత సాహిత్యానికి కొన్ని విభేదాలున్నాయి వాటిని గమనించకపోతే, శిల్పాభివ్యక్తి గురించే ఎవరైనా మాట్లాడతారు!
1.3.2.నిలదీసిన అనుభవం :
ఒక మాదిగ వ్యక్తి నిండుగా బట్టలు వేసుకుంటే చూసే చూపులకీ, అగ్రవర్ణమని పిలవబడే వ్యక్తి బట్టలు ధరించకపోవడంలో నిరాడం బరత్వాన్ని పోలిక చేసి “ఆహా కులమా!” పేరుతో రాసిన కవితలో ఒకడిది దర్పం, మరొకడిది నిరాడంబరత్వం అనడంలో చూసే చూపు సరిగ్గా లేదంటున్నారు కవి. ఈ కవితలో డా.అంబేడ్కర్‌, గాంధీలను స్ఫురింపజేస్తారు. దీన్ని సమాజంలో కుల నిర్మూలన ఆదర్శ ప్రకటనకు అనుసంధానిస్తూ –
” బాపనోడు కులం లేదంటే
మహోన్నత సంఘ సంస్కర్త, ఆదర్శ జీవి
మాలోడు ఇదే అంటే
ప్రమాదకరమైన పచ్చి కులతత్త్వవాది
‘ ఓసి ‘ కులమా
నీవెంత కసాయిదానివే?!” – అని ప్రశ్నించటంలో కనిపించే ఆధిపత్య భావజాలాన్ని వివరిస్తున్నారు కవి. దళితులపై సంస్కరణ పేరుతో చెలాయించే నాయకత్వాన్ని, దాని స్వభావంలో కనిపించే హిపోక్రసీని బహిర్గతం చేస్తున్నారు. “ఓసి” కులమా అనడంలో అగ్రవర్ణం అనే పార్శ్వాన్ని కూడా చూడగలిగే అవకాశం ఉంది. “ఓసి” కులమా అనే దానిలో కులాన్ని నిందించడమూ ఉంది. కులాంతర వివాహాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. నిజంగా ప్రేమించేవారికి ఆ కులం ప్రతిబంధకేమీకాదు. సరే, ముందుకెళ్ళి కులాంతర వివాహం చేసుకోకుండా సిద్ధపడితే, వ్యతిరేకించేదెవరో గమనించాలంటున్నారు కవి ఇలాంటి వైరుధ్యాలు నిండుగా పెట్టుకున్న ఆధిపత్య భావజాలం గలవాళ్ళు, తమ పిల్లలను వాళ్ళకు ఇష్టం ఉన్న లేకపోయినా తమ కులం వాళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. దానికి అనేక కథలల్లుతారు అంటారు కవి! “ఎర్రదొంగలు” కవితలో ” సమాజంలో కౌటిల్య కులాలేవీలేవంటూ
‘వర్గం వర్గం’ అంటూ కొంగ జపం చేస్తున్న
మార్స్కిస్టు అద్వైతులు
తన కొడుకులూ, కూతుళ్ళకు
తన కులపోళ్ళను మాత్రమే ఏరిఏరి
పెళ్ళిళ్ళు చేస్తున్న మార్స్కిస్టు మనువులు
ఇంటి గుమ్మంలో మార్క్స్, లెనిన్‌ల ఫోటోల తగిలించు” కునే ‘ఇంటి లోపలి దేవుని ఫొటోలు తగిలించే /హిందూ కమ్యూనిస్టుల డొల్లత్నాన్ని బట్టబయలు చేస్తున్నారు కవి. కులం వద్దంటూనే కులాన్ని పాటించే వాళ్ళలో వర్గవాదులు కూడా ఏ మాత్రం తీసిపోవట్లేదంటున్నారు కవి . వీళ్ళు ఎప్పటికీ కుల నిర్మూలనకి ఆదర్శవంతులు కాలేరనీ, దళితులు ఇటువంటి వారిపట్ల జాగురూకులై ఉండవలసిన అవసరాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు కవి . చరిత్రలో ఆదర్శవంతుల జాబితా కోసమే ప్రయత్నించే కుల నిర్మూలన సంస్కర్తల చరిత్రలను పునరాలోచించమంటున్నారు కవి .
1.3.3. ప్రత్యామ్నాయ పోరాటమార్గం:
‘వర్గ’ వాదులలో కనిపిస్తున్న ‘కులం’ ప్రభావాన్ని గుర్తించమంటున్నారు కవి . దీనికి స్వీయానుభవం, ‘కమ్యూనిస్టు ఉద్యమంపై కుల ప్రభావం’ పరిశోధనతో కూడిన గ్రంథం రాయడం శంబుక కవిత్వ అనుభవానికి బాగా తోడ్పడి ఉండవచ్చు. ‘ దళిత ‘గర్జన’ కవితా ఖండికలో –
” నిన్నడిగేది ఒక్కటే కామ్రేడ్!
వర్ణధర్మం పేరుతో వాడు నన్ను ఈసడిస్తే
వర్గ పోరాటం పేరుతో
నీవు నన్ను విస్మరిస్తున్నావు ” అని చెప్పడమే గాకుండా, నాయకత్వంలో ఉన్న వాళ్ళు వర్గవాదులూ దళితులను ప్రతిభలేని వాళ్ళుగా ముద్రవేస్తున్నారనీ, పార్టీ క్రమశిక్షణ పేరుతో సేవకులుగా మారుస్తున్నారనీ, మార్స్కిస్టు పడికట్టు పదాలతో గందరగోళానికి గురిచేయడం కంటే వాస్తవాన్ని గుర్తించాలంటున్నారు కవి. వినే పరిస్థితుల్లో లేని’ నాయకత్వ పరిరక్షణ జిత్తుల్ని పసిగట్టిన దళితులు’ ఎర్రజెండా వ్యాపారం చేస్తున్న
“ఈ ఎర్ర బూర్జువా/ వామపక్షీయుడో, రామపక్షీయుడో గానీ/ మా వ్యతిరేక పక్షీయుడవుతున్న వైనాన్ని గుర్తించారని ” పోయేదేమీ లేనోళ్ళం ” లో స్పష్టం చేసి, అన్నింటా మోసపోయిన పరిస్థితుల్లో, నమ్మిన వాళ్ళు కూడా దళితులను బానిసలుగా మార్చుకోవడాన్ని వ్యతిరేకించడం, స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించుకోమని ప్రభోధించడం కవి భావాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
1.4. శంబుక మార్క్సిజం:
దళితులు స్వతంత్ర పోరాటాల్ని నిర్మించుకుంటున్నారు. దానికి కారణాలేమిటి? మార్క్సిజంలోగల నాయకత్వ వైఫల్యం వల్లనా? మార్క్సిజం పునాదుల్లో ‘ కులం ‘ భాగం కానందువల్లనా ! అనేది శంబుక జీవితం, సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం చదివే వారికి స్పష్టంగానే తెలుస్తుంది. జెండాలు మోయడానికే ఉపయోగపడుతున్న దళితులు పార్టీ పేరుతో మార్క్సిస్టు భావజాలంలో , ఆదర్శంలో, ఆచరణలోకి రాకపోవడానికి కులమే కారణమవుతున్నా, దాన్ని అంగీకరించకుండా, కులాధిపత్య భావజాలంగల నాయకులే అడ్డుతగలడంవల్ల , ఆత్మగౌరవాన్ని చంపుకొని, ప్రాణాలను బలిపెట్టడానికే ఆ పోరాటాల్లో మిగిలిపోవడం కంటే, ఆత్మగౌరవ స్వతంత్ర కుల పోరాటం నిర్మించుకోమంటున్నారు కవి. దళితుల సమస్యలు ఎజెండాలో పెట్టమంటే , కుల తత్త్వాన్ని అంటగట్టడం, గతితార్కిక భౌతికవాదాల్ని వినిపించడం , ఉపరితల అంశాలన్నింటికీ, పునాదిలోని ఆర్థిక అంశాలే కారణమంటూ సాధారిణీకరించడాన్ని తీవ్రంగానే వ్యతిరేకించారు కవి . వ్యతిరేకించవలసిన అవసరాన్ని భవిష్యత్ తరాలకి కవిత్వంలో అందించి స్ఫూర్తిదాయకమయ్యారనుకోవచ్చు!
” ఈ సాంఘిక-ఆర్థిక అసమానతలపై
సాయుధంగా తిరగబడతాం
మాకు మేము మార్గదర్శకులమౌతాం
మేము కారల్‌మార్క్స్ చెప్పిన
పోయేదేమీ లేనోళ్ళం” అంటూ తాము మార్క్సిజాన్ని వ్యతిరేకించడంలేదనీ, మార్క్సిజాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పులచేసి, కులాన్ని కూడా ఎజెండా చేయాలని వాదించారు కవి. అలా కుదరదనుకున్నప్పుడు డా.అంబేడ్కర్ తాత్త్విక భూమికకు చేరువుగా మార్క్సిజాన్ని దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకోవాలనే దృక్పథం ‘శంబుక’లో కనిపిస్తుంది !
శంబుక రాసిన దళిత కవిత్వంలో ఇలా అనేక నూతన పార్శ్వాలు ప్రతిఫలించాయి సాంఘిక ఆర్థిక పార్శ్వాలు అందులో ప్రధానమైనవి. దళితులు కులం వర్గం రెండింటిని పట్టించుకోవలసిన అవసరం ఉందనే ఆలోచన బలంగానే వ్యక్తం అయ్యింది. అయితే శంబుక తాత్త్విక పోరాట దృక్పథంలో కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. కానీ, కవి ప్రత్యక్షంగా అనుభవించిన జీవితం నుండి ‘పోరాటమార్గం’ దళిత ఉద్యమం’ గా రూపొందిందేమో అర్థం చేసుకోవలసి ఉంది.’ శంబుక దళిత దృక్పథంలో కనిపించేవన్నీ వర్తమాన దళిత ఉద్యమం ఈ అన్ని భావాలను అంగీకరించాలనేమీ లేదు! కానీ, ‘శంబుక దృక్పథం’ లో అనేక అంశాలను వర్గవాదులు గుర్తించే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి . చికాగోలోని ‘హే’ మార్కెట్‌లో ఎనిమిది గంటల పనిదినం కోసం రక్తాన్ని చిందించిన కార్మికుల సమరత్యాగాన్ని నిత్యం స్మరించుకుంటూనే, కార్మికవర్గ చేతిలో నిలవ వలసిన ఎర్రజెండా, బూర్జువా, పెటీ బూర్జువాలు లాక్కోవడాన్ని వ్యతిరేకించినందుకు, దాన్ని బహిరంగంగా ఉద్యమ ప్రాయం చేసినందుకు ఆత్మత్యాగాన్ని చేయవలసి వచ్చింది శంబుక. తన ప్రాణం కోల్పోయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసమే జీవించిన దళితవీరుడిగా దళితుల, పీడితుల హృదయాల్లో కలకాలం నిలిచిపోతారు కవి శంబుక .

Add comment February 24, 2009

తెలంగాణ సంఘర్షణ పతాక కదిరె కృష్ణ కవిత్వం


-డా//దార్ల వెంకటేశ్వరరావు

తెలంగాణా ప్రాంతం వెనుకబడిందా? తెలంగాణా ప్రజలు వెనుకబడి ఉన్నారా? తెలంగాణా ప్రజల్నివెనక్కి నెట్టి వేశారా? అనే ప్రశ్నలు వేసుకుంటే అనేక రాజకీయ కారణాల వల్ల తెలంగాణా ప్రాంతం వెనకబడి పోయిందని ఆ చారిత్రక ఆధారాలు ఎన్నో వివరిస్తున్నాయి. నిజాం పాలన దానికొక కారణంగా చాలా మంది చెప్తున్నారు. తెలంగాణాలోని అత్యధికులు, కింది వర్గాలకు చెందిన ప్రజలు ఆర్ధికంగా వెనుకబడ్డారు. వెట్టితో నలిగిపోయారు. పోరాటాలు చేసి చేసి అలసి పోయారని చెప్పలేం గానీ, మరింత రాటుదేలారు. లేకపోతే ప్రపంచంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పిలిచే 1857 నాటి తిరుగుబాటు, తర్వాత అంత శక్తివంతమైన పోరాటం తెలంగాణాలోనే జరిగిందని విమర్శకులు వ్యాఖ్యానిస్తారా? కనుక ప్రజలు ‘పోరాటం’ చేయడంలో వెనుకబడి లేరు. వెనక్కి నెట్టబడుతున్నారు. పోరాటాల్ని నిజంగా’ గుర్తించని వాళ్ళు పాలకులుగా చెలామణి అవుతున్నారు. అందుకనే ఒకప్పుడు వెట్టి నిర్మూలన నిరంకుశ పాలనను వ్యతిరేకించి సాయుధ పోరాటం చేసి అనేక మంది ప్రాణాల్ని త్యాగం చేసి, విశాలాంధ్ర పేరుతో మళ్ళీ మోసపోతుంటే అది మోసమని ఘోషిస్తుంటే పోరాడుతుంటే ఆ పోరాటాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు నేటి పాలక వర్గమనీ చాలామంది భావిస్తున్నారు. పాలకులు ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుండా రక రకాల సాకుతో కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. వీటన్నింటిని తెలంగాణా ప్రాంతం మీద అభిమానం, అవగాహన, చైతన్యం ఉన్న కవులు, రచయితలు తమ రచనల్లో రాస్తూనే ఉన్నారు. అలా వచ్చినదే కదిరె కృష్ణ కవిత్వం”బలగం”
మాతృత్వం పైన, మాతృ భూమి పైన మమకారంతో కవిత్వం రాస్తున్నాడు కదిరె కృష్ణ. మత కల్లోలాపై ఆగ్రహం, ఆ కల్లోలాల వెనుక బలైపోయే దళితుల పట్ల ప్రేమ అతని కవిత్వంలో ఉంది. ప్రపంచీకరణ ప్రభావంతో అన్నీ మారుతున్న ‘కులం’ మాత్రం మాసిపోవడం లేదనే ఆవేదన ఉంది. తెలంగాణ ప్రాంతంలో దళితులు జీవించటమే కష్టమైన పరిస్థితుల్లో, ఒక దళిత మహిళ, అందులోనూ ఒక మాదిగ మహిళ దేశ రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాడం అసమాన్యమని కీర్తిస్తాడు. దళితుల్లోని అంతర్వివక్షనూ ప్రశ్నిస్తూనే మాదిగల గొప్పతనాన్ని వెల్లడిస్తాడు. స్త్రీలను గౌరవిస్తామంటూనే, ఫ్యాషన్స్‌ పేరుతో జరుగుతున్నవ్యాపారం, వ్యభిచారం కూపంలోకి దింపేస్తున్న ఆడపిల్లల్ని చూసి కవి చలించిపోతాడు. ప్రత్యేక తెలంగాణ పట్ల మాదిగల దృక్పథంగా తన అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వివరిస్తున్నాడు. మాదిగల్ని చైతన్య పరిచే సాహిత్యం సృష్టించిన కవుల్ని, కళాకారుల్ని ఉత్తేజ పరుస్తున్నాడు. ఇవన్నీ కదిరె కృష్ణ రాసిన ‘బలగం’(2007) కవితా సంపుటిలో బలంగా కనిపించే సమకాలీన సమాజం సంఘర్షణాత్మక కవితా చిత్రాలు.
ప్రపంచీకరణ ప్రభావం వల్ల గ్రామీణ సంస్కృతిలో వచ్చిన మార్పుల్ని వర్ణిస్తూ ………, “పట్ట పగలే/పల్లెనెవడో దోచుకుంటున్నాడు/నిర్భీతిగా/పొట్టలో తలదూర్చి/ నెత్తురు జుర్రేస్తున్నాడు/ గ్లోబల్ దొంగ / రంగు రంగుల ఛానళ్ళ కులాల దొంగ /మళ్ళీ సమధుల్లోకే పయనం…./……………………………/కళకళలాడిన పల్లె / కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న / “క్రౌంచ మిధునం”…… (బలగం, 2007 : 2) అనడంలో వలసలు పోతున్న జీవితాల్లో చెలరేగే సంఘర్షణను కవిత్వీకరిస్తున్నాడు కవి. ప్రేమానురాగాలతో కలిసి మెలిసి జీవించనివ్వని వలసల్ని, భార్యా భర్తల మధ్య అనివార్యమవుతున్న వియోగాన్ని “క్రౌంచ మిధునం” అనే భావం చేత కవిత్వీకరించాడు. వాల్మీక రామాయణం రావడానికి శోకం నుండి శ్లోకం అప్రయత్నంగా పుట్టడం కారణమని ఒక కథ ప్రచారంలో ఉంది. క్రౌంచ పక్షుల జంటను ఒక బోయ వాడు కొడితే, దానిలోని ఒక పక్షికి బాణం తగిలి, అది నేలపై పడి విలవిలలాడుతూ ప్రాణం విడుస్తుంది. తనకు దూరమైన పోతున్న పక్షి చుట్టూ తిరుగుతూ మరో పక్షి విలవిలలాడిపోతుంది. అలా గ్రామం వలసలతో భార్యాభర్తలు విడిచి ఉండలేక, విడవకపోతే బతకలేక మనోవ్యధకు గురవతన్నారని వర్ణిస్తున్నాడు కవి.
నాగప్పగారి సుందర్రాజు మరణించిన తర్వాత చాలా మంది స్మృతి కవితల్ని రాశారు. కదిరె కృష్ణ, నాగప్పగారి సుందర్రాజు పేరుతో సంభాషణాత్మక శిల్పంతో కవిత రాశాడు. చనిపోయిన సుందర్రాజుతో మాట్లాడుతున్నట్లు రాశాడు కవి. సుందర్రాజు స్థాపించిన “మాదిగ సాహిత్య వేదిక” ఆగిపోయినా, ఆ స్పూర్తితో మాదిగ కళాకారుల వేదికను కొనసాగిస్తున్నట్లు చెప్తాడు కవి. ఆ స్పూర్తి కొనసాగుతుండడం వల్లనే నగర వీధుల్లో డప్పులతో మాదిగలు తమ సంస్కృతిని విస్తరిస్తున్నారంటాడు కవి. ఈ కవితలో మూడు అంశాలున్నాయి.
1. వర్గీకరణ విషయాన్ని కోర్టు కొట్టేయడంతో మాల వర్గానికి చెందిన వారంతా సంతోషంగా ఉన్నారు.
2. అయినా వర్గీకరణ సాధన కోసం, దానితో పాటు మాదిగ చరిత్ర, సంస్కృతులను కొనసాగించే సంస్థలు కొత్త కొత్తగా పుడుతూనే ఉన్నాయని, మాదిగ చైతన్యం కొనసాగుతుందనే హామీ కనిపిస్తుంది.
3. దళిత, మాదిగల భావజాలాన్ని నిరంతరం ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుందనే విషయాన్ని, సుందర్రాజుతో అక్కడి విషయాల్ని తెలుసుకోవడంలో వర్ణించగలిగాడు. బ్రహ్మ, విష్ణు, రంభ, ఊర్వశిలనే హిందూ భావజాలంలో కనిపించే స్వర్గ నరకాలేవి లేవనీ, అవన్నీ అభూతకల్పనలనే భౌతికవాదిగా సుందర్రాజు భావజాలాన్ని వివరించగలిగాడు కదిరె కృష్ణ. ఆ కవితలోని కొంత భాగాన్ని కింద పరిశీలించవచ్చు…
“ఏం బ్రదర్! సోదరులు రెచ్చిపోతుండ్రంట!”/ …………..
…………… “మాదిగ చైతన్య వేదికను/మజ్జెల్నే ఆపిండ్రంటా!/ “అయితేందన్నా…!/మాదిగ కవుల కళాకారుల వేదిక /బెట్నెం!/’డప్పుల మోత’తో దద్దరిల్లుతోంది పట్నం” (బలగం: 2007 : 12)
ఈ కవితా ఖండికల్లో శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించగలిగాడు.
స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కులున్నా, వాటిని అందుకోలేని వాళ్ళలో దళితులే ముందున్నారు. ఈ విషయాన్ని వర్ణిస్తూ కవి…
“కలకటేరు బాబు కారుకు వేలాడుతున్న /మూడు రంగుల జెండా సాక్షిగా/ఆ బావి నీళ్ళు తోడడానికి అనర్హుడనని
ఊరు ఊరంతా గర్జిస్తే, పాలిపోయిన మొఖం వేసుకొని /మాటలొచ్చిన మూగదయ్యింది రాజ్యాంగం” (బలగం: 2007 : 18) అని చెప్పడంలో ‘రాజ్యాంగం’ హక్కులిస్తున్నా, వాటినింకా ఎంతోమంది దళితులు అందుకోలేక పోతున్నారనే సత్యాన్ని చెప్పాడు.
బంద్, సమ్మెలు వంటివేమి జరిగినా నష్టపోయేది దళితులేనని చెప్తూ కవి…
“అప్పుడప్పుడు /నగరం చిందులేస్తుంది/ఎలక్షన్ల సొల్లు మత్తు మత్తుగా చిత్తు చిత్తుగా తాగి /నలుగురు దళితుల్ని మింగి /ప్రశాంతంగా /హాయిగా త్రేనుస్తుంది/
………../దీని కడుపులో మనువు రాచపుండు ” (బలగం: 2007 : 18) ఉందనీ, దాన్ని ఆపరేషన్‌ చేయడానికి దళితులంతా ‘వైద్యులై’ కదలవలసిన అవసరం ఉందంటాడు. బంద్, సమ్మెల వంటివి జరిగేటప్పుడు దళితులెంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాడు కవి.
మాదిగవాడిగా కుంగిపోకుండా, ఆ కులంలో ఉంటూనే ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్న మంచి కవిత “నే నెవరో చెప్తుంది…”
“ఏవడ్రా ననుమించిన / ఇంజనీరు/ ఏదిరా నా చెప్పుల్ని మించిన/ మిషనేరు/ గూటం నా కుల గురువు/తంగేడు చెట్టు నా కల్పవృక్షం/కత్తికి కదనం నేర్పినోన్ని/ నెత్తుటి ముద్దలతో/దేశం సరిహద్దులు గీసినోన్ని/ మాదిగోన్ని” (బలగం: 2007 : 56)
మాదిగల కులవృత్తి, ఆ సాధనాలు, ఆ పనితనం, ఆ నైపుణ్యం వంటివన్ని ఈ కవితలో చెప్పటంలో ఆత్మగౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు కవి. వాటితోనే జీవితాంతం కొనసాగిస్తానని ఎక్కడా ప్రకటించలేదు. వృత్తులకన్నింటికీ గౌరవం కల్పించాలనే డిమాండ్ కనిపిస్తుంది. సమాజానికి మాదిగలు చేస్తున్న కృషిని గుర్తించమనే, కొందరి సేవనే గొప్పగా గుర్తించడం సరికాదనీ వివరిస్తున్నాడు కవి.
అన్నీ మారుతున్నా, ‘కులం’ మాత్రం పోవట్లేదని చెప్తూ “దీని దినం జెయ్య!” అనే కవితను రాశాడు కవి కదిరె కృష్ణ.
డొంకదారి, రేల పూత బంగారంలా మెరుస్తుంది. గ్రామాల్లో ల్యాండ్ ఫోన్స్‌ స్థానంలో సెల్‌ఫోన్స్‌, ఫోర్టబుల్ స్థానంలో ప్లాస్మా టీ.వీ.లు వస్తున్నాయి. ప్రత్యక్ష ప్రసారాలతో అన్ని సెకన్ల కాలంలో తెలిసిపోతున్నాయి. వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి.
“ఇరవై నాల్గు గంటల ప్రసారం/గుండు సూదుల్తో పెద్దాపరేషన్‌…” అన్నీ జరుగుతున్నాయి.
“మంచిదే! అన్ని మారినైగాని/మా ఊళ్ళె…/కులం మాత్రం/ మారలె…/దీని దినంజెయ్య! (బలగం: 2007 : 66)
ప్రపంచీకరణ ప్రభావంతో అన్ని మారుతున్నా కులం మాత్రం మారడంలేదనేది అనుభవ సత్యంగా చెప్తున్నాడు కవి.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలంతా పోరాడుతున్నారని చెప్తూ నైజాము నవాబుల్ని మట్టి కరిపించిన వీరుల్ని స్మరిస్తాడు కవి. సమకాలీన నాయకుల మీసాల్ని గుర్తిస్తున్నామంటాడు. మాదిగలు కూడా తెలంగాణా పోరాటాన్ని సమర్ధిస్తున్నారంటూ…
“డప్పు గూడ మోగుతున్నది / కన కన /రావాలని తెలంగాణ” (బలగం: 2007 : 71) అని ప్రకటించాడు కవి.తెలంగాణా కవులు అత్యధికులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరుకుంటున్నారు. ఈ ప్రాంత దళిత కవులూ అలాగే కోరుకుంటున్నా, వారికవిత్వంలో కుల నిర్మూలన కావాలనే ఆకాంక్ష బలంగా కనిపిస్తుంది. సమకాలీన సమస్యల్ని శక్తి వంతంగా కవిత్వీకరిస్త్నున్న కదిరె కృష్ణను అభినందించవలసిందే!

Add comment February 24, 2009

తెలంగాణా దళిత అంతర్మథన కవిత్వం ‘ఎగిలివారంగ’

డా//దార్ల వెంకటేశ్వరరావు
గతంలో తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన దళిత కవుల్లో కూడా అంబేద్కర్ భావజాలం కంటే, మార్క్సిస్టు భావాల పట్లే ఎక్కువ మమేకత్వం కనపడేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆ ధోరణి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంబేద్కరిజమ్పై ఆసక్తి పెరుగుతుంది. స్థానీయతను ఆకాంక్షిస్తూనే, దళితుల ఆత్మగౌరవం అంబేద్కరిజమ్లోనే అంతర్భూతంగా ఉందనే సంగతిని గుర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంతో పరిశీలిస్తే, చాలామంది తెలంగాణా దళిత కవులు పరిణామం ఈ దిశగా కొనసాగుతుందని స్పష్టమవుతుంది. ఇటీవల పొన్నాల బాలయ్య ‘ఎగిలి వారంగ’ పేరుతో తన కవితలన్నీ ఒక సంపుటిగా తెచ్చాడు. ‘పొద్దు పొడవాల’నేది ఆ కవితా సంపుటికి పెట్టిన పేరులోని అర్థం. దళిత సమస్యలెలా పరిష్కరించబడాలో, తెలంగాణా సమస్యనెలా పరిష్కరించుకోవాలో, వర్గీకరణ సమస్యనెలా అర్థం చేసుకోవాలో, మార్క్సిస్టు పోరాటాల్ని, ఆ పోరాటాల్లో బలైపోతున్న దళితుల జీవితాన్ని ఎలా బాగుచేసుకోవాలో, ప్రపంచీకరణ నుండి ఎలా రక్షించుకోవాలో, అన్నింటికీ మించి సంస్కృతినెలా కాపాడుకోవాలో వివరించే దిశగా ఆలోచించి ఒక కొత్త ‘పొద్దు పొడవాల’నే ఆకాంక్షను కవి ‘ఎగిలి వారంగ’ లో వ్యక్తం చేశాడు.
శక్తివంతమైన భావాన్ని, అంతేశక్తివంతంగా అందించగలగడమే కవిత్వం చేయడంలో కనిపించే శిల్పం. పొన్నాల బాలయ్య దాన్నింకా సాధన చేయవలసి ఉన్నా, తెలంగాణా పట్ల, ఆ ప్రాంతంలోని దళితుల పట్ల, మొత్తంగా ప్రజల ఆశల పట్ల స్పష్టమైన భావాలున్న కవి. వృత్తిరీత్యా హిందీ పండితుడైనా, తెలుగులో కవిత్వం రాస్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందించాలి. అలాగే, ఆ తెలుగులో కలిసిపోయిన మణి ప్రవాళ భాష గురించీ ఆలోచించమనాలి.
‘ఎగిలి వారంగ’ లో చిన్నప్పుడే చనిపోయిన తండ్రి స్మృతితో కవిత్వం ప్రారంభమౌతుంది. తన బాల్యమెంత విషాదకరంగా సాగిందో ‘ఎగిలివారంగ’ కవిత అనేక దృశ్య చిత్రాలతో చూపిస్తుంది. కవిత అంతా విడివిడిగా పదాలున్నట్లు ఉంటుంది. ఒకదానితో మరొక దానికి సంబంధం లేనట్లుంటుంది. తన బాల్యం కూడా ఒక పద్ధతి ప్రకారం కొనసాగలేదనీ, తనలాంటి వాళ్ళ బాల్యం కూడా అలాగే ఉందని కవి శిల్ప నైపుణ్యంతో చెప్తున్నాడు. ఒక అస్తవ్యస్థత ఆ కవిత నిండా ఉన్నట్లు ఉంటుంది. ఆయన రాసుకున్న జీవిత నేపథ్యం చదివితే, ఆ కవిత బాగా అర్థమవుతుంది. బహుశా దాన్ని అలా చెప్తేనే బాగుంటుందనుకున్నాడేమో!
“అయ్య కొట్టిన తంగెడు కట్ట

సోయి తప్పిన అవ్వ
ఆనిగపు బుర్ర నీళ్ళు….” ఇలా సాగిపోతుందీ కవిత.
తెలంగాణాకే ప్రత్యేకతను తెచ్చే పండగల్లో ఒకటి “బతుకమ్మ”. దీన్నితెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో దళితులు ఆడడానికి లేదు. ఆ పండగల్లో భాగస్వామ్యం కాలేని అలాంటి తెలంగాణా దళిత బాల్యాన్ని వర్ణిస్తూ…
“అందరు పండుగ మోజులవుంటే
నేను పశుల గాస్తుంటే
డప్పుల చప్పుళ్ళతో
బతుకమ్మను తెచ్చి ఆడుతావుంటే
ఆవలుండి చూసుటే తప్ప
పండుగ జరుపుకున్న పాపాన పోలేదు” (పుట: 20) అని ఆనాడు అందుకోలేని అందమైన బాల్యాన్ని, చేజారిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి.
మొదట్లో దళితుల్ని గుర్తించిందీ, చైతన్యం నింపిందీ ఖచ్చితంగా మార్క్సిస్టు సాహిత్యమే. నేటికీ దానిలో అదే మౌలిక భావన ఉంది. అయితే అది పీడిత వర్గదృక్పథంతో చూస్తుంది తప్ప, కుల స్పృహను ప్రధానంగా గుర్తించదు. కానీ, భారతదేశంలో కులమే ప్రధానమవుతుందని దళిత మేథావులు భావిస్తున్నారు. అదే అనేక సమస్యలకికారణమవుతుందని దళిత మేధావుల వాదన. ఆ పునాదిని గుర్తించకుండా కులాన్ని ఉపరితల అంశంగానే వర్గవాదులు గుర్తించడం జరుగుతోంది. మొదట్లో పీడిత వర్గ చైతన్యంతోనే తెలంగాణాలోనూ దళితులు ఆ భావజాల పార్టీల్లో పనిచేశారు. తర్వాత కాలంలో అంబేద్కర్ భావజాలంపై అవగాహన కొస్తున్నారు. దాన్ని కవి వర్ణిస్తూ…
“పగలనక రాత్రనక పశులుగాసి
ప్రపంచానికీ దూరంగా పస్తులుండి
కారడవిలో వింత పశువునై
అడవే నాకు అవ్వ – అయ్య
ఆత్మీయతతో అడవితల్లి ఆదరించింద’నీ గుర్తు చేసుకుంటాడు. అయితే, తర్వాత కాలంలో జరిగిన మోసాన్ని కూడా గుర్తించమంటున్నాడు కవి.
“చెమట చుక్కలతో చెలకదున్నిన
ఎగిలి వారంగ యాతం బోసిన
అలసట ఎరగక అన్ని పండించిన
…………………………………
ఊరు బయటనే అంటరానోన్ని జేసిండ్రు” అని అక్కడ కులాన్ని ఆధారం చేసుకుంటున్నారని, అంతర్గతంగా మార్క్సిస్టుల విధానాన్ని ప్రశ్నిస్తున్నాడు. దళితులకు నాయకత్వాన్ని అందనివ్వని స్థితిని గుర్తు చేస్తున్నాడు. అక్కడా హిందూ భావజాలమే మార్క్సిస్టుల్లో అంతర్భూతంగా పనిచేస్తుందంటాడు. అందుకే దళితులకు“కనులు తెరిపించే కాంతొకటి వచ్చిందిఅంబేద్కరే ఆ కాంతి ” ( పుట: 34) అని స్పష్టంగా అంబేద్కరిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు కవి. భూములిప్పిస్తామంటూ పోరాటాలు చేస్తుంటే, పోలిసులు జరిపే కాల్పుల్లో దళితులే ఎందుకు బలవుతున్నారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళనెందుకు ఆ తూటాలు తాకలేక పోతున్నాయో గుర్తించగలిగామని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు కవి…
“ఎగేసుడు, సగేసుడు ఎనుకనే నిల్చుండుడు
ముందుండి… ముదిగొండలో
అసువులు బాసింది…. అణగారిన వారే” (పుట: 29) అని ముదిగొండలో దళితుల్నే ఎందుకు కాల్చారో, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన వారెలా తప్పించుకోగలిగారో చెప్తున్నాడు.
తాను పుట్టి పెరిగిన తెలంగాణా ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేసుకుంటే తప్ప, నిజమైన పరిష్కారాలు లభించవనీ, అందుకే అందరూ కలిసికట్టుగా పోరాడమంటూ ప్రత్యేక రాష్ట్రం, ‘తల్లి తెలంగాణా’ కవితల్లో తెలంగాణాలో పాలకుల నిర్లక్ష్యం, స్వార్ధం వల్ల నిస్సారమై పోయిన స్థితిని వర్ణించాడు. “చావు తప్పి లొట్టబోయిన సంస్కృతిని, అస్తి పంజరంలా తయారైన గ్రామాల్ని నేపధ్యంగా చెప్పి, తేనెటీగల్లా కదిలి తెలంగాణా సాధించుకోవాలంటున్నాడు…
‘తెలంగాణ’ కవితలో!
“వలస పిట్టలు వాలకుండా
వడిశెలందుకుందాం
పర పాలకులు పొలిమేర పారంగ
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందాం” అంటున్న పొన్నాల బాలయ్య తన నేలమీద నిలబడి, తన నిజమైన గొంతుతో, ఎలాంటి అస్పష్టతా లేకుండా కవిత్వం రాస్తున్నందుకు అభినందించవలసిందే!

Add comment February 24, 2009

Previous Posts


Calendar

November 2009
M T W T F S S
« Sep    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Posts by Month

Posts by Category